Weight Loss: త్వరగా బరువు తగ్గాలని ఈ తప్పులు చేస్తున్నారా.? ఆరోగ్యానికి ప్రమాదం..

ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బరువు పెరుగుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ప్రజలు జిమ్‌ల బాట పడుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొందరు తప్పులు చేస్తుంటారు. ఇంతకీ బరువు.....

Weight Loss: త్వరగా బరువు తగ్గాలని ఈ తప్పులు చేస్తున్నారా.? ఆరోగ్యానికి ప్రమాదం..
Weight Loss diet
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 13, 2024 | 8:59 AM

ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బరువు పెరుగుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ప్రజలు జిమ్‌ల బాట పడుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొందరు తప్పులు చేస్తుంటారు. ఇంతకీ బరువు తగ్గే విషయంలో ప్రజలు చేసే తప్పులు ఏంటి.? దీనివల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొందరు తినడం తగ్గిస్తుంటారు. కొందరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే, మరికొందరు డిన్నర్‌ను స్కిప్‌ చేస్తుంటారు. అయితే ఇలా ఫుడ్‌ స్కిప్‌ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం కంటే పెరుగుతారు. సమయానికి సరిగ్గా ఆహారం తీసుకుంటూ కూడా బరువు తగ్గొచ్చు.

* ఇక బరువు తగ్గాలనుకునే వారు సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోకుంటే అనారోగ్యం బారిన పడడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకేసారి ఎక్కువగా తినడం లేదా పూర్తిగా మానేయడం మంచిది కాదని చెబుతున్నారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలని చెబుతున్నారు.

* కొందరు త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఇంటర్నెట్‌లో, సోషల్‌ మీడియాలో లభించే చిట్కాలను పాటిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే మీరు తీసుకునే ఆహారంలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ముందుగా డైటీషియన్ లేదా పోషకాహార నిపుణులను తప్పకుండా సంప్రదించాలి.

* ఇక బరువు తగ్గడానికి షార్ట్ కట్‌ ఉండదని అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రతీ రోజూ వాకింగ్ చేయడం, వ్యాయామం చేస్తూ ఫైబర్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
వైష్ణో దేవి భక్తుల్ని వెంటాడిన మృత్యువు..! 20 మందికి గాయాలు
వైష్ణో దేవి భక్తుల్ని వెంటాడిన మృత్యువు..! 20 మందికి గాయాలు
పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ..
పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ..
వరస అవకాశాలు, కోట్లలో రెమ్యూనిరేషన్. కానీ బీటౌనే.మృణాల్ కామెంట్స్
వరస అవకాశాలు, కోట్లలో రెమ్యూనిరేషన్. కానీ బీటౌనే.మృణాల్ కామెంట్స్
అనిల్‌ అంబానీకి నోటీసులు.. రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం
అనిల్‌ అంబానీకి నోటీసులు.. రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం
తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్ధులకు TGPSC కీలక అప్‌డేట్
తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్ధులకు TGPSC కీలక అప్‌డేట్
నాడు వైఎస్సార్‌, నేడు రైసీని పొట్టనబెట్టుకున్న బెల్..
నాడు వైఎస్సార్‌, నేడు రైసీని పొట్టనబెట్టుకున్న బెల్..
రూ.12 లక్షలు పెట్టి కుక్కల మారిన వ్యక్తి.. ఇప్పుడు మరో జంతువులా.?
రూ.12 లక్షలు పెట్టి కుక్కల మారిన వ్యక్తి.. ఇప్పుడు మరో జంతువులా.?
భారతీయుడు 2 నుంచి శౌర సాంగ్ విడుదల.. కానీ కమల్ మిస్సింగ్.
భారతీయుడు 2 నుంచి శౌర సాంగ్ విడుదల.. కానీ కమల్ మిస్సింగ్.
పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
వరమాల వేళ రెచ్చిపోయిన వరుడు.. పాపం.. వధువు పరిస్థితి చూడాలి మరీ.!
వరమాల వేళ రెచ్చిపోయిన వరుడు.. పాపం.. వధువు పరిస్థితి చూడాలి మరీ.!