మునగాకుతో మూడింతల అందం మీ సొంతం..!

Jyothi Gadda

26July 2024

మునగ ఆకులోని పోషకాలు.. ఫ్రీ రాడికల్స్‌ డ్యామేజ్‌‌ను నివారిస్తాయి. మునగాకు ఫేస్‌ ఫ్యాక్‌, మునగాకు ఆయిల్‌.. ముడతలు, గీతలు రాకుండా రక్షిస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మీ బ్యూటీ రొటీన్‌లో మునగాకు యాడ్‌ చేసుకుంటే ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. దీంతో, మీరు యవ్వనంగా కనిపిస్తారు. అలాగే ఇందులోని విటమిన్ ‘సి’ కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది.

కొలాజెన్‌ చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. కాబట్టి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. ముఖంపై సన్నటి గీతలుంటే అది తగ్గుముఖం పట్టి మీ చర్మం తాజాగా, అందంగా కనిపించేలా చేస్తుంది. 

మునగ నూనెలో ఉండే విటమిన్ సి, ఇ చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి. చర్మంపై ఉండే నల్లమచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్.. వంటి సమస్యలకు చక్కని పరిష్కారం.

మునగాకు ఓపెన్‌ పోర్స్‌ను తగ్గిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచే.. కొల్లాజెన్‌ ప్రొటిన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది చర్మ రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మునగాకు ఓపెన్‌ పోర్స్‌ను తగ్గిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచే.. కొల్లాజెన్‌ ప్రొటిన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది చర్మ రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

లిప్‌ బామ్స్‌, పెదవుల సంరక్షించే.. ఉత్పత్తులలో మునగాకు నూనెను వాడుతుంటారు. ఇది పెదవుల సున్నితమైన చర్మాన్ని తేమగా, మృదువుగా మారుస్తుంది. శీతాకాలంలో మీ పెదవుల సంరక్షణకు సహాయపడుతుంది. 

మునగాకు నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ గుణాల వల్ల చర్మంపై కాలిన మచ్చలు, గాయాలు.. వంటివి త్వరగా నయమవుతాయి.