వంట పాత్రల దుర్వాసన చిటికెలో మాయం చేసే చిట్కాలు

26 July 2024

TV9 Telugu

TV9 Telugu

వంట చేయడం కంటే గిన్నెలు కడగడం చాలా శ్రమతో కూడుకున్న పని. పాత్రల అడుగున మాడిన పదార్ధాలు, దుర్వాసన, నూనె జిగట వంటి మొండి మరకలు అంత సులువుగా వదలవు

TV9 Telugu

దీంతో గంటల తరబడి గృహిణులు పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటారు. గిన్నెలు కడిగిన తర్వాత కూడా చాలా సార్లు పాత్రల దుర్వాసన వదలదు. దీంతో మళ్లీ మళ్లీ కడిగవల్సి ఉంటుంది 

TV9 Telugu

పాత్రల వాసన వేడి నీటితో శుభ్రం చేసినా తొలగిపోదు. వంటల దుర్వాసన వదలకుండా అవే పాత్రల్లో మళ్లీ మళ్లీ వంట చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. మరైతే వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవడం ఎలా?

TV9 Telugu

వంట పాత్రలు కడిగేటప్పుడు నిమ్మరసం లేదా దానిపై తొక్కతోపాత్రలను కడిగేందుకు ఉపయోగించాలి. నిమ్మ తొక్కను, ఉప్పుతో కలిపి పాత్రలను రుద్ది చూడండి. మరకలు, వాసనలు ఇట్టే మాయమవుతాయి

TV9 Telugu

డిష్ వాషింగ్ లిక్విడ్ లేదా సోప్‌తోపాటు నిమ్మరసం లేదా నిమ్మ తొక్కను వేడి నీటిలో కలపాలి. వంట పాత్రలను ఇందులో కాసేపు ఉంచి.. నాననివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే వాసన ఇట్టే పోతుంది

TV9 Telugu

మొండి మరకలు, వాసనలు తొలగించడానికి బేకింగ్ సోడా, వెనిగర్ కూడా వినియోగించవచ్చు. వీటితో వంట పాత్రలను తోమితే పాత్రల మురికి చిటికెలో మాయమవుతుంది. ఈ ట్రిక్ వంట పాత్రలను మెరిసేలా చేస్తుంది

TV9 Telugu

వంట పాత్రలలోని మాంసం, చేపల వాసనను తొలగించడానికి వెనిగర్ ఉపయోగపడుతుంది. డిష్ సబ్బుతో వెనిగర్ కలిపి పాత్రలను కడగవచ్చు

TV9 Telugu

అలాగే ఒక గిన్నెలో కప్పు వెనిగర్ వేసి, డిష్ సబ్బుతో గిన్నెలు కడిగినా పాత్రల మురికి ఇట్టే వదిలిపోతుంది. ఈ వంటింటి చిట్కాలు మీ రోజు వారీ పనులను సులభతరం చేస్తాయి