
అందువల్ల రాత్రిపూట చపాతీలు ఎక్కువగా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీర కొవ్వు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి పరిమితంగా, తేలికైన విందు తీసుకోవడం ఎల్లప్పుడూ ప్రయోజనకరం. రాత్రిపూట సాధారణంగా పురుషులకు మహిళల కంటే ఎక్కువ శారీరక శ్రమ, కేలరీల అవసరం ఉంటాయి. అయితే రాత్రిపూట ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్యకరమైన వారు రాత్రి భోజనంలో 2 నుంచి 3 చపాతీలు తింటే సరిపోతుంది.

మంటలో కాలిన చపాతీ/రోటీ.. ఎందుకు అనారోగ్యం కలిగిస్తుంది?.. చపాతీ నేరుగా మంటలో ఉడికినప్పుడు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు రుచి కోసం కొంత మంది ఆస్వాదిస్తారు, కానీ ఎక్కువ వేడిలో వండినప్పుడు కొంత రసాయనాలు, పాలీసైక్లిక్ ఆర్బొమాటిక్ హైడ్రోకార్బన్లు, అక్రిలామైడ్ వంటి పదార్థాలు ఉత్పన్నమవుతాయి. ఇవి అధిక పరిమాణంలో, తరచుగా తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదంతో సంబంధం కలిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Chapati

వీలైతే గోధుమ చపాతీకి బదులుగా జొన్నలు, మిల్లెట్ చపాతీ తినడం మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం మానుకోవాలి. భోజనం చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన చపాతీ వండే విధానాలు.. చపాతీని పెనంపైనే కాల్చి తినండి. మంటపై నేరుగా కాల్చడం తగ్గించండి. తక్కువ వేడిలోనే చపాతీని కాల్చండి. పెనం మందంగా ఉంటే.. చపాతీ మంచిగా ఉడుకుతుంది. చపాతీని నల్లటి మచ్చలు వచ్చే వరకు కాల్చకూడదు. చపాతీ కాలిన మచ్చలు పెద్ద సమస్య కాదు కానీ.. ధూమపానం, ప్రాసెస్ చేసిన ఆహారం, ఎక్కువ చక్కెర, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి.. ఇవే ప్రధాన క్యాన్సర్ కారణాలు. అందుకే ఒకటి రెండు సార్లు ఇలాంటి చపాతీలు తినడం అంత హానికరమేమీ కాదని అన్నారు.

అధిక బరువుతో ఉంటే లేదా బరువు తగ్గాలనుకుంటే 2 చపాతీలు, వాటితో పాటు ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పప్పులు తీసుకోవాలి. మహిళలకు పురుషుల కంటే జీవక్రియ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి వారు రాత్రి భోజనంలో కేలరీల తీసుకోవడం నియంత్రించుకోవాలి.