Lifestyle: రోజులో ఎన్ని పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవాలో తెలుసా.? నిపుణులు ఏమంటున్నారంటే..

పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నొప్పికి సాధారణంగా ఉపయోగించే మందు పారాసెటమాల్. నొప్పిగా ఉంటే వెంటనే పారాసెటమాల్ వాడాలని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అయితే 8 గంటల వ్యవధిలో 500 mg మాత్రలు రోజుకు...

Lifestyle: రోజులో ఎన్ని పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవాలో తెలుసా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Pain Killers

Updated on: Mar 17, 2024 | 7:51 PM

కాస్త తలనొప్పిగా అనిపించగానే ఒక ట్యాబ్లెట్ వేసుకో అని సూచిస్తారు. కాస్త ఒంటి నొప్పులు ఉండగానే ఒక డోలో వేసేయ్‌ అంటుంటారు. అయితే వెంటనే రిలీఫ్‌ ఇచ్చే ఈ పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒకటి కంటే ఎక్కువ పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుంటే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నొప్పికి సాధారణంగా ఉపయోగించే మందు పారాసెటమాల్. నొప్పిగా ఉంటే వెంటనే పారాసెటమాల్ వాడాలని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అయితే 8 గంటల వ్యవధిలో 500 mg మాత్రలు రోజుకు 3-4 సార్లు తీసుకోవచ్చని, అది కూడా వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ట్యాబ్లెట్‌ను 3-4 రోజుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. అందులోనూ వైద్యుల సూచన మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.

పెయిన్‌ కిల్లర్లను విచక్షణారహితంగా తీసుకుంటే పేగులు, కిడ్నీలు, కాలేయాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. వ్యాధిని గుర్తించి, దాని మూలం నుంచి నిర్మూలించే వరకు నొప్పి మందులు నిరంతరం తీసుకోవడం హానికరమని వైద్యులు అంటున్నారు. పెయిన్‌ కిల్లర్లన్నీ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో తీవ్రమైన ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా కిడ్నీల పనితీరుపై పెయిన్‌ కిల్లర్స్ సైడ్‌ ఎఫెక్ట్స్‌ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. అలాగే కొందరిలో చర్మం సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి కూడా వేధిస్తుందని చెబుతున్నారు. అందుకే పెయిన్‌ కిల్లర్స్‌ను మితంగా తీసుకోవడమే ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..