Health Tips: షుగర్ నుంచి బరువు తగ్గడం వరకు.. ఈ ఒక్కటి తాగితే చాలు.. కళ్లుచెదిరే బెనిఫిట్స్..

అల్లంను ఆయుర్వేదంలో అనాదిగా ఒక ముఖ్యమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అల్లం వేరులో ఉండే జింజెరాల్ అనే శక్తివంతమైన సమ్మేళనం మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఉదయం ఒక కప్పు అల్లం టీ తాగితే జీర్ణ సమస్యలు నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

Health Tips: షుగర్ నుంచి బరువు తగ్గడం వరకు.. ఈ ఒక్కటి తాగితే చాలు.. కళ్లుచెదిరే బెనిఫిట్స్..
Ginger Tea Health Benefits

Updated on: Oct 09, 2025 | 2:16 PM

మీకు తెలుసా.. మనం రోజు తాగే అల్లం టీ మామూలు టీ కాదు.. ఇది ఒక సూపర్ పవర్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఆయుర్వేదం దీనిని ఔషధంగా వాడింది అంటే దాని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉదయం ఒక కప్పు అల్లం టీ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు. అసలు అల్లం టీ వల్ల కలిగే అద్భత ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపు సమస్యలకు రాంరాం

అల్లం టీ కడుపు సమస్యలకు దివ్యౌషధం లాంటిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీని తగ్గిస్తుంది. భోజనం తర్వాత తాగితే జీర్ణం బాగా అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. కడుపుకి ఇది చాలా రిలాక్సింగ్‌గా పనిచేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఫ్రెండ్

మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే అల్లం టీని ట్రై చేయండి. ఇది మీ మెటబాలిజంను పెంచుతుంది. అంటే మీ శరీరం కేలరీలను వేగంగా కరిగిస్తుంది. దీనివల్ల కొవ్వు పేరుకుపోవడం తగ్గి, బరువు తగ్గడం ఈజీ అవుతుంది.

సహజమైన నొప్పి నివారిణి

అల్లం టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో నొప్పి, మంటను తగ్గిస్తాయి. కండరాల నొప్పి, కీళ్ల నొప్పి ఉన్నవారికి ఇది చాలా మంచిది. అంతేకాదు పీరియడ్స్ నొప్పి నుంచి కూడా ఇది ఉపశమనం ఇస్తుంది. ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది.

వికారం, వాంతులకు చెక్

ప్రయాణించేటప్పుడు వాంతులు లేదా వికారం సమస్య ఉందా? లేక గర్భిణీ స్త్రీలలో కనిపించే మార్నింగ్ సిక్నెస్ అయినా సరే, అల్లం టీ తాగితే వెంటనే ఉపశమనం దొరుకుతుంది. వికారం సమయంలో అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇమ్యూనిటీ బూస్టర్

అల్లం టీలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతాయి. ఇది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఇది శరీరాన్ని వెచ్చగా, ఎనర్జీగా ఉంచుతుంది.

షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్

గుండె ఆరోగ్యానికి, మధుమేహం ఉన్నవారికి కూడా అల్లం టీ చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

అల్లం టీలో ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ.. మోతాదు మించకూడదు. రోజుకు 1 లేదా 2 కప్పుల కంటే ఎక్కువ తాగితే కొంతమందికి అసిడిటీ లేదా గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. మీకు కడుపు సమస్యలు ఉంటే లేదా గర్భిణీగా ఉంటే, అల్లం టీ తాగే ముందు డాక్టర్‌ని అడగడం ఉత్తమం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..