
పెళ్లి సమయం దగ్గర పడుతుంటే ప్రతీ వధువు తన చర్మం ఎంతో అందంగా, మృదువుగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటుంది. దీనికోసం పార్లర్లలో వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రీ-బ్రైడల్ బాడీ పాలిషింగ్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. అయితే, కెమికల్స్ ఉండే ఉత్పత్తులకు బదులుగా మన వంటింట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో అద్భుతమైన బ్రైడల్ బాడీ పాలిష్ తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి సహజమైన మెరుపును ఇస్తుంది.
శనగపిండి: 1 పెద్ద చెంచా
గోధుమపిండి: 1 పెద్ద చెంచా
పసుపు: చిటికెడు (యాంటీబాక్టీరియల్ గుణాలు ఉన్నది)
పాల మీగడ: 1 చెంచా
పాలు: తగినంత మిశ్రమం ప్యాక్‌లా అవ్వడానికి
నిమ్మరసం: కొన్ని చుక్కలు
ఆవనూనె లేదా కొబ్బరి నూనె: 1 నుండి 2 చెంచాలు
చందనం పొడి: 1 చెంచా సువాసన, చల్లదనం కోసం – ఐచ్ఛికం
ఒక పాత్రలో శనగపిండి, గోధుమపిండి, చందనం పొడి, చిటికెడు పసుపు వేసి కలపాలి. అందులో పాల మీగడ, కొన్ని చుక్కల నిమ్మరసం, ఆవనూనె లేదా కొబ్బరి నూనె మరియు తగినన్ని పాలు పోసి మెత్తటి పేస్ట్‌లా కలుపుకోవాలి. మిశ్రమం మరీ పల్చగా కాకుండా చర్మానికి సులభంగా పట్టేలా కలుపుకోవడం ముఖ్యం.
స్క్రబ్బింగ్, మసాజ్: సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని శరీరంపై, చేతులు, కాళ్ళు, మెడ భాగంలో సున్నితంగా వృత్తాకారంలో మసాజ్ చేస్తూ పూయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై చర్మానికి మంచి విశ్రాంతి లభిస్తుంది.
ట్యాన్, డెడ్ స్కిన్ నివారణ: శనగపిండి, పిండి చర్మంపై ఉన్న మురికిని, అదనపు నూనెను తొలగిస్తాయి. నిమ్మరసం, పాలు చర్మంపై ఉన్న నల్లటి ట్యాన్‌ను తగ్గించి స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తాయి.
చర్మానికి పోషణ: మీగడ, నూనె చర్మానికి అవసరమైన తేమను అందించి ఎండిపోకుండా మృదువుగా ఉంచుతాయి.
శుభ్రం చేయడం: ఈ ప్యాక్‌ను 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, పొడిగా మారిన తర్వాత చేతులకు కొద్దిగా నీరు రాసుకుని సున్నితంగా రుద్దుతూ తొలగించి, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఈ హోమ్మేడ్ బ్రైడల్ బాడీ పాలిషింగ్ క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు చేయడం వల్ల పెళ్లి నాటికి చర్మం సహజమైన కాంతితో, పట్టులాంటి మృదుత్వంతో మెరిసిపోతుంది.