సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్ మిల్క్.. ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!

మండిపోతున్న ఎండల వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి నీరసం రావడం సహజం. ఇలాంటప్పుడు బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్‌కు బదులుగా, ఇంట్లోనే లభించే పదార్థాలతో ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ యారు చేసుకోవచ్చు. వేసవిలో ఎండల వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించి, శరీరాన్ని చల్లబరిచేందుకు ఈ డ్రై ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్‌ ఒక అద్భుతమైన పానీయంగా పనిచేస్తుంది. దీని తయారీ విధానం, అద్భుత ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్ మిల్క్.. ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!
Dry Fruit Milk

Updated on: Apr 20, 2026 | 2:31 PM

వేసవి తాపాన్ని తరిమికొట్టి శరీరానికి తక్షణ శక్తినిచ్చే డ్రై ఫ్రూట్ మిల్క్ (Dry Fruit Milk) ఉపయోగాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. మార్కెట్‌లో లభించే కృత్రిమ పానీయాల కంటే ఎంతో ఆరోగ్యకరమైన ఈ హోమ్ మేడ్ ఎనర్జీ డ్రింక్ తయారీకి కావాల్సినవి బాదం, జీడిపప్పు, పిస్తా వంటి పోషకాలున్న డ్రై ఫ్రూట్స్‌తో పాటు శరీర వేడిని తగ్గించే సబ్జా గింజలు, సోంపు, రోజ్ పెటల్స్ ఇందులో ప్రధాన పదార్థాలు. ఈ పానీయం పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మంచి శక్తిని అందిస్తుంది. కంప్లీట్‌ రెసీపీ ఇక్కడ చూద్దాం..

కావలసిన పదార్థాలు:

బాదం (10), జీడిపప్పు (12), పిస్తా (12).

ఇవి కూడా చదవండి

సబ్జా గింజలు (2 టీ స్పూన్లు).

పాలు (1 లీటరు).

కస్టర్డ్ పౌడర్ (2 టేబుల్ స్పూన్లు).

పంచదార లేదా పటిక బెల్లం (1/3 కప్పు).

యాలకుల పొడి, సోంపు, రోజ్ పెటల్స్ (ఎండిన గులాబీ రేకులు).

తయారీ విధానంలోకి వెళితే..

ముందుగా సబ్జా గింజలను నీటిలో నానబెట్టాలి. అలాగే బాదం, జీడిపప్పు, పిస్తాను 2-3 గంటల పాటు నానబెట్టి, బాదం, పిస్తా తొక్కలను తొలగించాలి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ను మిక్సీ జార్‌లోకి తీసుకుని.. అందులో రోజ్ పెటల్స్, సోంపు, యాలకులు, కస్టర్డ్ పౌడర్, పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనికి కొద్దిగా పాలు కలిపి స్మూత్ పేస్ట్‌లా తయారు చేయాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో లీటరు పాలు పోసి బాగా మరిగించాలి. పాలు పొంగిన తర్వాత మంట తగ్గించి, మనం సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని అందులో కలుపుతూ 5-10 నిమిషాల పాటు మరిగించాలి. పాలు చిక్కబడ్డాక స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు చల్లారాక అందులో నానబెట్టిన సబ్జా గింజలు, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్ ముక్కలు కలపాలి. దీనిని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది.

సమ్మర్ స్పెషల్ ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ ప్రయోజనాలు సైతం బోలెడు ఉన్నాయి. ఇందులోని సబ్జా గింజలు, సోంపు శరీర ఉష్ణోగ్రతను తక్షణమే తగ్గిస్తాయి. ఇందులోని డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందించి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. రోజ్ పెటల్స్ పానీయానికి మంచి సువాసనతో పాటు చలువను ఇస్తాయి. ఈ వేసవిలో మీ కుటుంబ సభ్యులకు రుచికరమైన, శక్తినిచ్చే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్‌ను అందించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us