చికెన్ లివర్ Vs మటన్ లివర్.. దేనిలో ప్రోటీన్, ఐరన్ ఎక్కువ ఉంటుంది..? ఆరోగ్యానికి ఏది బెస్ట్..

కెన్ లివర్, మటన్ లివర్ రెండింటిలోనూ ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి. అయితే దేనిలో ప్రోటీన్ ఎక్కువ? ఐరన్, జింక్, విటమిన్ ఎ ఏ లివర్‌లో అధికంగా లభిస్తాయి? రక్తహీనత ఉన్నవారు ఏది తీసుకోవాలి? చికెన్ లివర్, మటన్ లివర్ మధ్య పోషక విలువల తేడాలు, ఆరోగ్య ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి..

చికెన్ లివర్ Vs మటన్ లివర్.. దేనిలో ప్రోటీన్, ఐరన్ ఎక్కువ ఉంటుంది..? ఆరోగ్యానికి ఏది బెస్ట్..
Chicken Liver Vs Mutton Liver

Updated on: Nov 02, 2026 | 1:17 PM

నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ను ఇష్టంగా తింటారు. కర్రీ, ఫ్రైతోపాటు.. పలు రకాలుగా వండుకుని తింటారు. అయితే.. నాన్‌వెజ్‌లో ఎప్పుడూ లివర్ ( కాలేయం ) వంటకాలకు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. చికెన్ లివర్ అయినా.. మటన్ లివర్ అయినా.. చాలా మంది ఎంతో ఆస్వాదిస్తూ తింటారు. అయితే, మార్కెట్లో లభించే చికెన్ లివర్, మటన్ లివర్‌లలో ఏది శరీరానికి అత్యధిక ప్రయోజనాలను అందిస్తుందనే విషయంపై తరచూ సందేహాలు ఏర్పడుతుంటాయి.. ఈ కథనంలో చికెన్ లివర్ వర్సెస్ మటన్ లివర్ .. ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం..

చికెన్ లివర్ ప్రయోజనాలు..

చికెన్ లివర్ పోషకాల పరంగా ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ ఎ, ఫోలేట్లతో పాటు విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా, ఉడికించిన చికెన్ లివర్‌లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఎంపికగా నిలుస్తుంది. ఇది చాలా మృదువుగా ఉండి త్వరగా జీర్ణమవుతుంది.

మటన్ లివర్ లాభాలు..

మటన్ లివర్‌లో విటమిన్ ఎ, డి, బి12లతో పాటు ఐరన్, జింక్, పొటాషియం, కాపర్ వంటి ఖనిజ లవణాలు అత్యధిక పరిమాణంలో ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేస్తూ రక్తహీనత (అనీమియా)ను అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చికెన్ లివర్‌తో పోలిస్తే మటన్ లివర్‌లోనే పోషకాల సాంద్రత ఎక్కువని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా రక్తహీనత సమస్యను ఎదుర్కొనే మహిళలకు మటన్ లివర్ అత్యంత మంచిదని పేర్కొంటున్నారు డైటీషియన్లు..

రెండూ మంచివే కానీ..

చికెన్ లివర్, మటన్ లివర్ రెండింటిలోనూ శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే అవసరాలను బట్టి ఏది మంచిదనేది మారుతుంది. వాస్తవానికి మటన్, చికెన్ లివర్ రెండూ ఆరోగ్యానికి మంచివే.. త్వరగా జీర్ణమయ్యే ఆహారం కావాలన్నా, ఫోలేట్, విటమిన్ B12 ఎక్కువగా అందాలన్నా చికెన్ లివర్ మంచి ఎంపిక.. కండరాల బలం, ఎక్కువ ప్రొటీన్, జింక్ కావాలనుకునే వారికి మటన్ లివర్ మేలు చేస్తుంది. అయితే, లివర్‌ను బాగా ఉడికించి మాత్రమే తినాలి.

అయితే, లివర్ ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు లేదా ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నవారు లివర్ వంటకాలకు దూరంగా ఉండటమే మేలు.. అలాగే గర్భిణులు చికెన్ లివర్ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తిన్నా.. మితంగా తినడం మంచిది.

లివర్‌ను నూనెలో తీవ్రంగా వేయించి (డీప్ ఫ్రై) తినడం వల్ల కొవ్వు శాతం పెరిగి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి వీటిని శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి మితమైన పరిమాణంలో తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us