Interesting Facts: మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తినొచ్చా?

|

Apr 02, 2024 | 8:59 PM

పండ్లలో రారాజు ఏది అంటే మామిడి పండే. వేసవి అనగానే చాలా మందికి గుర్తొచ్చే విషయాల్లో మామిడి పండు కూడా ఒకటి. మామిడి పండ్లు అంటే ఇష్ట పడని వారు ఎవరూ ఉండరు. పిల్లలు, పెద్దలు ఒకటి తర్వాత మరొకటి అని లాగించేస్తూ ఉంటారు. వేసవిలో మామిడి కాయలకు కొదవే ఉండదు. చాలా మంది ఎక్కువగా మామిడి పండ్లనే కొంటూ ఉంటారు. మార్కెట్లోకి మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్త ఉంటారు. అయితే చాలా మంది ఒకటే సారి మామిడి పండ్లను కొని ఫ్రిజ్‌లో స్టోర్..

Interesting Facts: మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తినొచ్చా?
Interesting Facts
Follow us on

పండ్లలో రారాజు ఏది అంటే మామిడి పండే. వేసవి అనగానే చాలా మందికి గుర్తొచ్చే విషయాల్లో మామిడి పండు కూడా ఒకటి. మామిడి పండ్లు అంటే ఇష్ట పడని వారు ఎవరూ ఉండరు. పిల్లలు, పెద్దలు ఒకటి తర్వాత మరొకటి అని లాగించేస్తూ ఉంటారు. వేసవిలో మామిడి కాయలకు కొదవే ఉండదు. చాలా మంది ఎక్కువగా మామిడి పండ్లనే కొంటూ ఉంటారు. మార్కెట్లోకి మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్త ఉంటారు. అయితే చాలా మంది ఒకటే సారి మామిడి పండ్లను కొని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టుకుని తినవచ్చా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా..

మామిడి పళ్లను రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయవచ్చా అంటే.. ఎక్కువ రోజులు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు
ఉంచడం వల్ల మామిడి పండ్లలో ఉండే పోషక విలువలు అనేవి ప్రభావితం అవుతాయట. దీని వల్ల పోషకాలు అనేవి సరిగ్గా శరీరానికి అందవు. దీంతో మామిడి పండ్లు తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ మామిడి పండ్లను ఎలా నిల్వ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అవి టిప్స్ కూడా ఉన్నాయి.

మామిడి పండ్లను ఎలా నిల్వ చేయాలంటే..

* మామిడి పండ్లను కొనేముందు కొన్ని చిట్కాలు పాటించాలి. అన్ని పండ్లు పండినవే కాకుండా… కాస్త పండనవి కూడా తీసుకోవాలి. అప్పుడు ఒకటే సారి పాడవ్వకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

* మామిడి పండ్లును ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. అప్పుడు మామిడి పండు రుచి బావుంటుంది. అలాగే ఎండు గడ్డి లభ్యమైతే.. వాటిపై మామిడిపండ్లను ఉంచితే చాలా మంచిది.

* అలాగే మామిడి పండ్లు కొన్ని రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలనుకుంటే.. వాటికి ఉన్న పీల్ తీసేసి.. సీలు చేసిన కంటైనర్స్‌లో నిల్వ చేయండి. ఇలా నెల లేదా రెండు నెలల వరకూ ఉంచవచ్చు.

* మామిడి పండ్లు త్వరగా పాడవ్వకుండా, ఫ్రెష్‌గా ఉండాలంటే.. నీటిలో నిల్వ ఉంచాలి. ఒక పాత్ర తీసుకుని అందులో వాటర్ పోసి.. మామిడి కాయలు వేసి.. ఓ పాత్రలో ఉంచడం వల్ల మామిడి కాయలు కుళ్లి పోకుండా.. ఫ్రెష్‌గా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..