
కోడిగుడ్డును ఉడకబెట్టినా, పొరటు చేసినా, ఆమ్లెట్‌గా వేయించినా లేదా హాఫ్ బాయిల్ చేసినా దానిలోని ప్రొటీన్ పరిమాణంలో ఎలాంటి మార్పూ ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పెద్ద గుడ్డులో సుమారు 6.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. వంట చేసేటప్పుడు వేడి తగలడం వల్ల ప్రొటీన్ నిర్మాణం మాత్రమే మారుతుంది.. తప్ప దాని పోషక విలువలు తగ్గవు. నిజానికి, పచ్చి గుడ్డు కంటే వండిన గుడ్డు తిన్నప్పుడే మన శరీరం ప్రొటీన్‌ను సులభంగా గ్రహిస్తుంది. అయితే, ఇక్కడే ఒక మెలిక ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం.. గుడ్డును ఏ పద్ధతిలో వండినా దానిలోని ప్రొటీన్ పరిమాణంలో పెద్దగా మార్పు ఉండదు. ఒక పెద్ద పచ్చి గుడ్డులో ఎంత ప్రొటీన్ (సుమారు 6.3 గ్రాములు) ఉంటుందో, దాన్ని ఉడకబెట్టినా లేదా ఫ్రై చేసినా అంతే ప్రొటీన్ లభిస్తుంది. వంట చేసే సమయంలో మనం వాడే నూనె, వెన్న, లేదా పాలు వంటి అదనపు పదార్థాల వల్ల క్యాలరీలలో తేడా రావచ్చు తప్ప, గుడ్డులోని సహజ ప్రొటీన్ తగ్గదు. వేడి తగలడం వల్ల ప్రొటీన్ అణువుల నిర్మాణం మారుతుంది తప్ప ప్రొటీన్ నశించదు.
పచ్చి గుడ్లతో పోలిస్తే, వండిన గుడ్ల నుండి మన శరీరం ప్రొటీన్‌ను చాలా వేగంగా, సమర్థవంతంగా గ్రహిస్తుంది. గుడ్డును వేడి చేసినప్పుడు దానిలోని ప్రొటీన్ నిర్మాణం విడిపోయి, మన జీర్ణ ఎంజైమ్‌లు దాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా, వండటం వల్ల గుడ్డులో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి ఆరోగ్యానికి సురక్షితంగా మారుతుంది.
మితిమీరిన వేడి లేదా నూనెలో తీవ్రంగా వేయించడం వల్ల అమినో ఆమ్లాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల, మితమైన వేడితో ఉడకబెట్టడం లేదా హాఫ్ బాయిల్/పోచింగ్ చేయడం అత్యుత్తమ పద్ధతులుగా నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ప్రొటీన్ సులభంగా జీర్ణమవడానికి సహాయపడటమే కాకుండా అదనపు క్యాలరీలు లేకుండా శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..