నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడొద్దు.. క్యాన్సర్ సహా ఈ రోగాలన్నీ పరారే..

కొన్ని రకాల టిఫిన్‌ల నుంచి అన్నం వరకు.. ప్రతిదానిలోనూ బియ్యం తప్పనిసరి. మనం ఏ రకమైన బియ్యం లేదా నాణ్యతను ఉపయోగిస్తున్నామన్నది అర్థం చేసుకోకుండా.. మనం బియ్యాన్ని మాత్రం కచ్చితంగా ఉపయోగిస్తాము. అయితే.. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా చాలా మంది ఆరోగ్యం పై దృష్టిసారిస్తున్నారు.

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడొద్దు.. క్యాన్సర్ సహా ఈ రోగాలన్నీ పరారే..
Black Rice

Updated on: Feb 28, 2026 | 9:58 AM

రెండు పూటలా అన్నం తినకపోతే.. ఎదో తెలియని వెలతి ఉంటుంది. కొంత మంది అయితే మూడు పూటలా అన్నం తింటారు.. అన్నం లేకుండా భోజనం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కొన్ని రకాల టిఫిన్‌ల నుంచి అన్నం వరకు.. ప్రతిదానిలోనూ బియ్యం తప్పనిసరి. మనం ఏ రకమైన బియ్యం లేదా నాణ్యతను ఉపయోగిస్తున్నామన్నది అర్థం చేసుకోకుండా.. మనం బియ్యాన్ని మాత్రం కచ్చితంగా ఉపయోగిస్తాము. అయితే.. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా చాలా మంది ఆరోగ్యం పై దృష్టిసారిస్తున్నారు. వైట్ రైస్ బదులు ఈ రోజుల్లో.. నల్ల బియ్యం (బ్లాక్ రైస్) కి ప్రాధాన్యత పెరుగుతోంది.

నల్ల బియ్యంలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బియ్యం కాకుండా నల్ల బియ్యం తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది శరీరంలోని ప్రతి స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

బ్లాక్ రైస్‌లో ఆంథోసైనిన్లు ఉంటాయి.. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, వృద్ధాప్యం నుండి కణాలను రక్షిస్తుంది.

దీనిలోని పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.. బ్లాక్ రైస్ లోని ఆంథోసైనిన్లు కాలేయాన్ని డిటాక్సిఫై చేయడంతో పాటు, కంటి చూపును మెరుగుపరుస్తాయి.

ఈ బియ్యంలో ఫ్లేవనాయిడ్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి.. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి. బ్లాక్ రైస్ తినడం వల్ల ధమనులలో ప్లేక్ పేరుకుపోవడం వల్ల గుండె సమస్యలు నివారిస్తుంది.

నల్ల బియ్యం (బ్లాక్ రైస్) శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. ఇందులోని ఫైటోన్యూట్రియెంట్లు హానికరమైన అంశాలను తొలగించి కాలేయాన్ని రక్షిస్తాయి. ఇది చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి నల్ల బియ్యం మంచిది.

బ్లాక్ రైస్ బరువును తగ్గిస్తుంది. బరువు పెరగకూడదనుకునే వారు ఈ బియ్యాన్ని తినవచ్చు. ముఖ్యంగా, నల్ల బియ్యం తెల్ల బియ్యం కంటే తక్కువ GI ట్యాగ్ కలిగి ఉంటుంది. అందుకే.. ఇది వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us