తులసి ఆకులను కడిగి మెత్తగా రుబ్బుకుని అందులో నిమ్మకాయ రసాన్ని పిండి పేస్ట్‌లా చేసుకోండి. దీనిని ముఖంపై ఉన్న నల్లటి మచ్చలపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లో నల్ల మచ్చల నుంచి విముక్తులవుతారు.
రెండు గ్లాసుల నీటిలో చెంచా జీలకర్ర వేసి బాగా మరిగించాలి. చల్లబడిన తర్వాత వాటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో మచ్చలు మాయమవుతాయి.
కర్పూరం ముక్క, ఒక చెంచా ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, కొన్ని చుక్కల తేనె బాగా కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఈ రెమిడీ నల్లమచ్చలపై చాలా ప్రభావం చూపుతుంది.
నిమ్మరసాన్ని కూడా నేరుగా కూడా ఉపయోగించవచ్చు. ఇది నల్లదనాన్ని తొలగిస్తుంది. 10 నుంచి15 నిమిషాల పాటు చర్మంపై అప్లై చేసిన తర్వాత ముఖాన్ని కడగాలి.