
అరటిపండు తొక్క జారే స్వభావంపై జపాన్‌లోని కితాసాటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనకు గాను వారికి ప్రతిష్టాత్మక ‘ఇగ్ నోబెల్’ బహుమతి లభించింది. అరటిపండు తొక్క లోపల పాలిసాకరైడ్ జెల్‌తో నిండిన చిన్న కణాలు ఉంటాయని వారు కనుగొన్నారు. మనం తొక్కపై అడుగు పెట్టినప్పుడు, మన శరీర బరువుకు ఆ కణాలు పగిలి లోపల ఉన్న రసాయన మిశ్రమాన్ని విడుదల చేస్తాయి. ఈ జెల్‌లో నీరు, చక్కెర ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జారుడు పదార్థంగా మారతాయి.
మెదడుపై ప్రభావం
పరిశోధకుల ప్రకారం, అరటిపండు తొక్క Coefficient of Friction కేవలం 0.07 మాత్రమే. ఇది మంచుపై నడవడం కంటే చాలా తక్కువ. మనం అరటి తొక్కపై అడుగు పెట్టినప్పుడు, ఈ జెల్ పాదానికి తొక్కకు మధ్య ఒక పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల పాదం ఊహించని వేగంతో ముందుకు కదులుతుంది. మన మెదడు ఈ వేగవంతమైన మార్పును గ్రహించేలోపే, మన శరీరం గురుత్వాకర్షణ కేంద్రం సమతుల్యతను కోల్పోయి మనం కింద పడిపోతాం. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగడం వల్ల మనిషి తనను తాను నియంత్రించుకోవడం అసాధ్యం.
ఇతర పండ్లతో పోలిక
చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే, యాపిల్ లేదా నారింజ తొక్కలలో కూడా తేమ ఉంటుంది కదా, మరి అవి ఎందుకు అంత ప్రమాదకరం కావు అని. యాపిల్ లేదా నారింజ తొక్కలలో అరటిపండులో ఉండే ఆ ప్రత్యేకమైన ‘పాలిశాకరైడ్ జెల్’ ఉండదు. ఆ పండ్ల తొక్కల నిర్మాణం పదార్థం ఘర్షణను అంతగా తగ్గించలేవు. అందుకే, అరటిపండు తొక్క ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జారుడు పదార్థంగా నిలిచింది. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది కాబట్టి, అరటిపండు తిన్న తర్వాత తొక్కను ఎల్లప్పుడూ చెత్తబుట్టలోనే వేయడం మంచిది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. రోజువారీ జీవితంలో ప్రమాదాలను నివారించడానికి పారిశుధ్యం భద్రతా నియమాలను పాటించడం ఎల్లప్పుడూ అవసరం.