చిన్నగా ఉన్నాయని చీప్‌గా చూసేరు.. ఎన్నో సమస్యలకు బ్రహ్మాస్త్రం.. బాడీలో కొవ్వును ఇట్టే కోసి పడేస్తది..

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం కారణంగా, చాలా మంది కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, మీరు వామును తినవచ్చు. ఆయుర్వేదంలో వామును అద్భుతమైన దివ్యఔషధంగా పేర్కొంటారు.. వామును తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. 

చిన్నగా ఉన్నాయని చీప్‌గా చూసేరు.. ఎన్నో సమస్యలకు బ్రహ్మాస్త్రం.. బాడీలో కొవ్వును ఇట్టే కోసి పడేస్తది..
Ajwain

Updated on: Oct 07, 2025 | 7:07 PM

ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం మన ఆరోగ్యం గురించి స్పృహతో ఉండటం ముఖ్యం.. అలాగే.. మన చుట్టూ ప్రకృతి ప్రసాదించిన చిన్న, చిన్న.. సహజమైన పదార్థాలు.. అవి చేసే మేలు.. అలాగే.. సమస్యలకు ఎంత మేర ప్రయోజనకరంగా ఉంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో వాము (ఓమ) ఒకటి.. వాము అనేది వంటలో మసాలాగా ఉపయోగించే ఒక చిన్న మసాలా పదార్ధం. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, మన శరీరాలను వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. వాము జీర్ణక్రియను మెరుగుపరచడంలో.. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.. అలాగే దగ్గు, జలుబు, బ్రోన్కైటిస్‌ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో, కీళ్లనొప్పులను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వాము తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. వాము గింజల్లో థైమోల్ – కార్వాక్రోల్ వంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. ఇవి మన హృదయాలను బలోపేతం చేయడానికి – సాధారణ రక్తపోటును నిర్వహించడానికి సహాయపడతాయి. రక్తపోటు మన శరీర అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ ఒత్తిడి చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే, అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వాము రక్తపోటుకు చాలా మంచిది.. ఎందుకంటే ఇది గుండె కండరాలను సడలిస్తుంది.. సాధారణ రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. అందువల్ల, అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడేవారికి వాము ప్రయోజనకరంగా ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

వాము చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలోని ఒక రకమైన కొవ్వు.. అది ఎక్కువగా పెరిగితే అది గుండెకు హాని కలిగిస్తుంది. అయితే.. వాము దానిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ఇంకా బరువును నియంత్రణలో ఉంచుతుంది.

కడుపు సమస్యల నుండి ఉపశమనం:

వాము గ్యాస్, మలబద్ధకం – కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కడుపు చికాకును తగ్గిస్తుంది.. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి – కడుపును తేలికగా ఉంచుతుంది. వాము కడుపు కండరాలను కూడా సడలిస్తుంది.. ఇంకా కడుపు తిమ్మిరి – నొప్పిని తగ్గిస్తుంది. ఇంకా శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.. జలుబు, ఫ్లూ – అనేక ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంకా, దీని నూనె కండరాల నొప్పి – జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us