Ratan Tata: వ్యాపార దిగ్గజం రతన టాటా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు ఇవే.. చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

మరి ఇంత ధనికుడైన రతన్ టాటా జీవనశైలి ఎలా ఉటుంది? ఆయన ఎలాంటి వస్తువులు వినియోగిస్తారు? ఆయన ఎలాంటి కార్లు వాడుతారు? ఆయన నివసించే ఇల్లు ఎలా ఉంటుంది?

Ratan Tata: వ్యాపార దిగ్గజం రతన టాటా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు ఇవే.. చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
Ratan Tata
Follow us

|

Updated on: Feb 25, 2023 | 1:10 PM

టాటా గ్రూప్ సంస్థల గురించి మన దేశంలో ప్రత్యేక్యంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. వ్యాపారంలో ఎదగాలి అనుకొనే ప్రతి ఒక్కరికీ ఆయనో ఇన్ స్పిరేషన్. రోజూ మనం తాగే టీ పొడి దగ్గర నుంచి స్టీల్, కారు, ట్రక్, ఫైనాన్స్, ఇన్సురెన్స్, ట్రస్ట్, విమానాల వరకు ఎన్నో రంగాల్లో వ్యాపారం చేసి విజయకేతనం ఎగురవేశారు రతన్ టాటా. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఈయన కూడా ఒకరు. ఈయన ఆస్తులు 2022 వరకూ ఒక బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. మరి ఇంత ధనికుడైన రతన్ టాటా జీవనశైలి ఎలా ఉటుంది? ఆయన ఎలాంటి వస్తువులు వినియోగిస్తారు? ఆయన ఎలాంటి కార్లు వాడుతారు? ఆయన నివసించే ఇల్లు ఎలా ఉంటుంది? అనే ఆసక్తి అందరికీ ఉంటుంది. మరి ఆ సంగతులు ఇప్పుడు చూద్దాం రండి..

ఫెర్రారీ కాలిఫోర్నియా.. ఎరుపు రంగు ఫెర్రారీ కాలిపోర్నియా మోడల్ ను రతన్ టాటా కొనుగోలు చేశారు. 4.3-లీటర్ వీ8 ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ వాహనం 490 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 504 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే ఈ మోడల్ ను ఫెర్రారీ కంపెనీ మనదేశంలో నిలిపివేసింది.

డస్సాల్ట్ ఫాల్కన్ ప్రైవేట్ జెట్.. రతన్ టాటా ప్రయాణాలకు ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ జెట్ ఉంది. దీని పేరు డస్సాల్ట్ ఫాల్కన్ 2000. రెండు ఇంజిన్లు కలిగిన ఈ జెట్ ను ఫ్రెంచ్ ఇంజినీర్ల బృందం తయారు చేసింది.

ఇవి కూడా చదవండి

ముంబైలో బంగ్లా.. అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉండే రతన్ టాటా బంగ్లా అద్భుతమైన వ్యూ ని అందిస్తుంది. ఇది 15,000 స్క్వేర్ ఫీట్ లలో విస్తరించి ఉంటుంది. ఈ బంగ్లాలో ఏడు అంతస్తులు ఉంటాయి. పై అంతస్తులో ఇన్ఫినిటీ పూల్.. అనువైన కార్ పార్కింగ్, మీడియా రూం, లాంజ్ వంటివి ఉన్నాయి. ఇది ముంబైలోనే అత్యంత ఖరీదైన ఇళ్లల్లో ఒకటి.

మసెరటి క్వాట్రోపోర్టే.. రతన్ టాటా తన గ్యారేజీలో మసెరటి క్వాట్రోపోర్టేను కలిగి ఉన్నారు. ప్రతి ఆటోమొబైల్ కానాయిజర్ కలల కారు ఇది. దీనిలో ట్విన్-టర్బో V6 పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఇది 424 బీహెచ్ పీ హార్స్ పవర్, 580 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ల్యాండ్ రోవర్ ఫ్రీ ల్యాండర్.. మరో హై ఎండ్ కారు ల్యాండ్ రోవర్ ఫ్రీ ల్యాండర్ ను రతన్ టాటా కలిగి ఉన్నారు. ఈ కారు 4-సిలీండర్ల డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉండి 190 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 420 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేట్టయాన్ వివాదం పై.. అసలు వివరణ ఇదే
వేట్టయాన్ వివాదం పై.. అసలు వివరణ ఇదే
కొడుకు ధాటికి.. పక్కకు తప్పుకున్న తండ్రి
కొడుకు ధాటికి.. పక్కకు తప్పుకున్న తండ్రి
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత