రోజూ ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే.. ఏమవుతుందో తెలుసా?
Narender Vaitla
10 October 2024
కిడ్నీలో రాళ్ల సమస్య రావవొద్దంటే కొబ్బరి నీళ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాళ్లను ఏర్పరిచే ఖనిజాల సాంధ్రతను తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి.
కొబ్బరి నీళ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సంబంధిదత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఎంజైమ్‌లు ఇందులో ఉంటాయి.
నిత్యం చెమటతో ఇబ్బంది పడేవారికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులోని పొటాషియం కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
కొబ్బరి నీళ్లలో విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలని అనుకుంటున్నారా.? అయితే రోజూ కొబ్బరి నీళ్లను తీసుకోండి. దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరవు తగ్గడంలో దోహదపడుతుంది.
పైన తెలిసిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.