స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వంకాయ తినడం వల్ల దురద మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
మానసిక సమస్యలైన డిప్రెషన్, ఒత్తిడితో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు అంటున్నారు. వీటివల్ల స్ట్రెస్ లెవల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
రక్త హీనతతో బాధపడేవారు కూడా వంకాయను తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వంకాయ శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. వీటివల్ల గ్యాస్ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
పైల్స్ సమస్యతో బాధపడేవారు కూడా వంకాయను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
కళ్లలో మంట, నీరు కారడం వంటి కంటి సంబంధిత అలర్జీలతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలి. లేదంటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
వంకాయలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. కాబట్టి రాళ్ల సమస్య ఉన్న వారు వీటికి దూరంగా ఉండడమే మంచిది.
పైన తెలిసిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.