Video: పైసా ఖర్చు లేదు.. కష్టపడాల్సిన పనిలేదు.. 11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు..

బరువు తగ్గడం అంటే జిమ్‌కి వెళ్లి రక్తం చిందించాలి.. లేదా వేలకు వేలు పెట్టి డైటీషియన్ల చుట్టూ తిరగాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్రేజీ సక్సెస్ స్టోరీ వింటే మీ మైండ్ మారిపోవాల్సిందే. ఎలాంటి ఫ్యాన్సీ డైట్లు లేకుండా.. కేవలం మన వంటింట్లో దొరికే ఐదు పదార్థాలకు గుడ్ బై చెప్పి, 11 నెలల్లో ఏకంగా 32 కిలోల బరువు తగ్గి రికార్డ్ కొట్టింది ఓ మహిళ. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Video: పైసా ఖర్చు లేదు.. కష్టపడాల్సిన పనిలేదు.. 11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు..
32 Kg Weight Loss In 11 Months

Updated on: Jul 11, 2026 | 11:58 AM

ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది చాలా మందికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కసారి వెయిట్ పెరిగామా.. దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. బరువు తగ్గడం కోసం జిమ్‌లలో గంటల తరబడి చెమటలు చిందిస్తూ, కఠినమైన డైట్లు ఫాలో అయ్యేవారు ఎందరో ఉన్నారు. కానీ ఎలాంటి ఫ్యాన్సీ డైట్లు లేకుండా, డైటీషియన్ల చుట్టూ తిరగకుండా.. కేవలం ఇంట్లోనే ఉంటూ 11 నెలల్లో ఏకంగా 32 కిలోల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చింది దీప్తి హర్షన అనే మహిళ. తొలుత 92 కిలోలు ఉన్న దీప్తి, తన లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఏకంగా 60 కిలోలకు చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఈ క్రేజీ వెయిట్ లాస్ జర్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీప్తి నో చెప్పిన ఆ 5 పదార్థాలు ఇవే..

స్వీట్లు, కూల్ డ్రింక్స్

దీప్తి తన డైట్ నుండి కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, పంచదార ఎక్కువగా ఉండే పానీయాలను పూర్తిగా బంద్ చేసింది. వీటి వల్ల శరీరంలో క్యాలరీలు విపరీతంగా పెరిగిపోయి, వాటర్ రిటెన్షన్ జరుగుతుంది. వీటి ప్లేస్‌లో ఆమె నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంది.

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్‌లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఫ్యాట్ పేరుకుపోతుంది. అందుకే వైట్ బ్రెడ్ స్థానంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, ఓట్స్‌ను తన డైట్‌లో చేర్చుకుంది.

ప్యాకేజ్డ్ స్నాక్స్

చిప్స్, కుర్కురే, ఫర్సాన్ వంటి ప్యాకెట్ ఫుడ్స్‌లో ఉప్పు, క్యాలరీలు కొండలా ఉంటాయి. ఇవి తింటే పదే పదే ఆకలి వేస్తుంది. అందుకే దీప్తి వీటికి దూరంగా ఉంటూ.. ఆకలి వేసినప్పుడు వేయించిన శనగలు, డ్రై ఫ్రూట్స్, మఖానా తినడం స్టార్ట్ చేసింది.

ఫాస్ట్ ఫుడ్

బయట దొరికే బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నూనె పదార్థాలను దీప్తి ముట్టుకోలేదు. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తయారుచేసుకునే వెజ్ రోల్స్, ర్యాప్స్, పనీర్ టిక్కా, చికెన్ టిక్కా వంటి హెల్దీ ఫుడ్‌ను ఆస్వాదించింది.

లేట్ నైట్ స్నాకింగ్

చాలా మందికి రాత్రి పూట టీవీ చూస్తూనో, మొబైల్ చూస్తూనో ఏదో ఒకటి నమలడం అలవాటు. ఆకలి లేకపోయినా ఇలా అర్ధరాత్రి తినడం వల్ల క్యాలరీలు విపరీతంగా పెరిగిపోతాయి. దీప్తి మొదటగా ఈ బ్యాడ్ హ్యాబిట్‌కు చెక్ పెట్టింది.

సీక్రెట్ ఏంటంటే.. ఖేల్ ఖతం..

ఆమె తన వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. బరువు తగ్గడానికి ఆమె ఎలాంటి ఖరీదైన డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వలేదు. కేవలం ఇంటి భోజనం, రోజుకు 45 నిమిషాల వ్యాయామం.. ఈ రెండింటినే నమ్ముకుంది. 11 నెలల పాటు క్రమం తప్పకుండా పాటించిన క్రమశిక్షణే ఆమెను 92 కిలోల నుండి 60 కిలోలకు తీసుకొచ్చింది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలంటే జిమ్‌లకే వెళ్లక్కర్లేదు.. నోటిని అదుపులో పెట్టుకుని, ఇంట్లో కష్టపడితే చాలని దీప్తి నిరూపించింది.

వీడియో చూడండి..

Follow Us