Young Tiger NTR: ఆ క్రేజీ డైరక్టర్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.?

|

Feb 16, 2020 | 2:39 PM

Young Tiger Next Movie: ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఎవరితో చేస్తారన్న దానిపై సరైన క్లారిటీ రాలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా దాదాపు ఖరారైనా.. తాజాగా మరో క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Also Read: Prabhas Mahesh Babu Multi […]

Young Tiger NTR: ఆ క్రేజీ డైరక్టర్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.?
Follow us on

Young Tiger Next Movie: ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఎవరితో చేస్తారన్న దానిపై సరైన క్లారిటీ రాలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా దాదాపు ఖరారైనా.. తాజాగా మరో క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Also Read: Prabhas Mahesh Babu Multi Starrer With Rajamouli

జాతీయ అవార్డు గ్రహీత వెట్రీమారన్ డైరక్షన్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అసురన్ దర్శకుడు ఎన్టీఆర్‌కు కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ క్రియేషన్స్‌పై నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘అసురన్’ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.