ఇండోనేషియా: ఇది చాలా తక్కువ ఖర్చుతో తిరిగి రావాలనుకునేవారు ఇండోనేషియాకు వెళ్ళడం ఉత్తమం. 188.61 ఇండోనేషియా రూపాయలకు 1 భారత రూపాయి సమానం కాబట్టి తక్కువ మొత్తం ఖర్చుతోనే కొత్త సంవత్సరం వేడుకలను ఆ దేశంలో జరుపుకోవచ్చు.
హంగరీ: అతి తక్కువ ఖర్చుతో సందర్శించగల ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో యూరోపియన్ కంట్రీ అయిన హంగరీ ఒకటి. ఈ దేశంలో 3 వేలు లేదా 4 వేల రూపాయల ఖర్చుతోనే హోటల్స్ లభిస్తాయి. హంగేరియన్ 4.63 హంగేరియన్ ఫోరింట్‌లతో మన ఒక్క రూపాయి సమానం. కాబట్టి లక్ష లోపు ఖర్చుతోనే నూతన సంవత్సరాన్ని సరదాగా ప్రారంభించవచ్చు.
నేపాల్: హిమాలయాల దిగువన ఉన్న నేపాల్ తక్కువ ఖర్చుతోనే పర్యటించగల గొప్ప పర్యాటక ప్రదేశం. 1 భారత రూపాయి= నేపాల్ రూపాయి 1.60 నేపాల్ రూపాయి. కాబట్టి నేపాల్‌లో అది కూడా హిమాలయాల దిగువన మీ నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి.
కబోండియా: చాలా తక్కువ ఖర్చుతోనే మీ నూతన సంవత్సర వేడుకలను కబోండియాలో జరుపుకోవచ్చు. 1 భారత రూపాయి = 49.68 కబోండియన్ రీల్ కావడంతో ఈ దేశంలోని పచ్చని కొండల మధ్య నూతన సంవత్సరాన్ని ఆహ్వానించవచ్చు.
శ్రీలంక: అందమైన బీచ్‌లు, సహజమైన ప్రకృతి దృశ్యాలు, పురాతన దేవాలయాలతో కూడిన గొప్ప పర్యాటక ప్రదేశం శ్రీలంక. 4.44 శ్రీలంక రూపాయలకు 1 భారత రూపాయి సమానం. కాబట్టి తక్కువ ఖర్చుతో ఈ దేశాన్ని సందర్శించవచ్చు.
ఐస్‌లాండ్: ఈ దేశానికి మీరు చాలా తక్కువ ధరకు వెళ్లవచ్చు. 1 భారత రూపాయి = 1.71 ఐస్లాండిక్ క్రోనా కాబట్టి సరదాగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి ఇది అనువైన ప్రదేశం.
వియత్నాం: వియత్నాం సందర్శించడానికి చాలా తక్కువ ఖర్చు అవడమే కాక ఇది ఉత్తమ ప్రదేశం. వియత్నాం దక్షిణ చైనా సముద్రంలో ఆగ్నేయాసియాలోని అందమైన బీచ్‌లు, నదులు,మ్యూజియాలకు ప్రసిద్ధి. భారత రూపాయి 1కి వియత్నామీస్ 285.30 వియత్నామీస్ డాంగ్ సమానం
కోస్టారికా: లాటిన్ అమెరికాలోని కోస్టారికాలోని అందమైన ప్రదేశాలతో ఉంటుంది. పచ్చని కొండలు, కొండల మధ్య అందమైన క్షణాలను గడపవచ్చు. 1 భారత రూపాయి.. 7.8 కోస్టా రికన్ కోలన్‌లతో సమానం. సంతోషకరమైన వాతావరణంలో మీ నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు ఈ దేశానికి వెళ్లవచ్చు.