విజయసాయి రెడ్డికి చేదు అనుభవం.. నేను కూడా కాపునే!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్టణం కంబాల కోటలో పలువురు ‘కాపుల ఆత్మీయ కలయిక’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విజయసాయి రెడ్డి పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ఆయన్ని చూసిన కొందరు జై కాపు.. జై జై కాపు అంటూ నినాదాలు చేశారు. కాపు మహా సభలకు వైసీపీ నేతలను ఎలా తీసుకువస్తారని? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. […]

విజయసాయి రెడ్డికి చేదు అనుభవం.. నేను కూడా కాపునే!

Edited By:

Updated on: Dec 16, 2019 | 3:10 PM

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్టణం కంబాల కోటలో పలువురు ‘కాపుల ఆత్మీయ కలయిక’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విజయసాయి రెడ్డి పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ఆయన్ని చూసిన కొందరు జై కాపు.. జై జై కాపు అంటూ నినాదాలు చేశారు. కాపు మహా సభలకు వైసీపీ నేతలను ఎలా తీసుకువస్తారని? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. తాను కూడా కాపునేనని.. చనిపోయాక తన డెత్‌ సర్టిఫికేట్‌లో కాపు అని రాసి ఉంటుందని చెప్పారు. ఇక ఈ విషయంలో అవంతి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ.. తాను మంత్రి అయినందు వల్లే సహనంగా ఉన్నానన్నారు. ఈలోపు కొందరు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడగా.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం జోక్యం కాదని అవంతి సదరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us