కేజీఎఫ్ హీరో యశ్ కుమారుడి పేరేంటో తెలుసా..

|

Sep 01, 2020 | 12:48 PM

య‌శ్...కేజీఎఫ్ చిత్రంతో దేశ‌వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన యువ హీరో‌. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్న ఈ న‌టుడు త్వ‌ర‌లోనే తన అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని అందించనున్నారు...

కేజీఎఫ్ హీరో యశ్ కుమారుడి పేరేంటో తెలుసా..
Follow us on

Yash Second Child Naming Ceremony : య‌శ్…కేజీఎఫ్ చిత్రంతో దేశ‌వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన యువ హీరో‌. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్న ఈ న‌టుడు త్వ‌ర‌లోనే తన అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని అందించనున్నారు. ఇక య‌శ్ ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే 2016లో రాధిక పండిట్‌ని వివాహం చేసుకున్నాడు. వీరి కూతురు ఐరా, కుమారుడు ఉన్నారు.

తన కుమారుడి నామ‌కర‌ణ వేడుక జ‌రిపించారు. 2019 అక్టోబ‌ర్ 30 య‌శ్-రాధిక దంప‌తుల‌కి కుమారుడు జ‌న్మించాడు. అయితే ఆ తర్వాత నామకరణమహోత్సవం జరిపించాలనుకునేంతలో కరోనా వచ్చింది. దీంతో మంచి రోజులు చూసుకుని నామకరణోత్సవం సోమవారం రోజు జరిపించారు.

తమ ఫాం హౌజ్‌లో కొద్ది మంది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. య‌ధ‌ర్వ్ య‌శ్ అనే పేరుని త‌న కుమారుడికి పెట్టిన‌ట్టు యశ్ పేర్కొన్నారు. ఫోటోలలో య‌శ్ కుమారుడిని చూసిన అభిమానులు జూనియ‌ర్ రాకీ భాయ్ వ‌చ్చేశాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.