వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2020 రద్దు

|

Oct 22, 2020 | 2:12 PM

కరోనావైరస్ సంక్షోభం కారణంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరగనున్న వరల్డ్ జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2020ను రద్దు చేసినట్లు......

వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2020 రద్దు
Follow us on

కరోనావైరస్ సంక్షోభం కారణంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరగనున్న వరల్డ్ జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2020ను రద్దు చేసినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యుఎఫ్) గురువారం ప్రకటించింది. బిడబ్ల్యుఎఫ్ సెక్రటరీ జనరల్ థామస్ లండ్ మాట్లాడుతూ.. ” వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ 2020 నిర్వహించకపోవడం పట్ల మేము కూడా నిరాశ చెందుతున్నాము. కోవిడ్ నిబంధనలు, పరిమితులు ఈ టోర్నీ నిర్వహణను సంక్లిష్టం చేశాయి” అని పేర్కొన్నారు. కోల్పోయిన ఎడిషన్‌కు బదులుగా 2024 ఎడిషన్‌ను నిర్వహించాలన్న న్యూజిలాండ్ ప్రతిపాదనను బ్యాడ్మింటన్ అత్యున్నత సంస్థ అంగీకరించింది. ( “వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్ )

జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహించేందు బ్యాడ్మింటన్ న్యూజిల్యాండ్, వారి భాగస్వాములు, ఆ దేశ ప్రభుత్వం ఎంతో ఆసక్తి కనబరిచాయి. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. వారి చూపించిన నిబద్దతకు మేము ధన్యవాదాలు చెబుతున్నాం.  ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడానికి వారు చేసిన న్యాయమైన ప్రయత్నాలకు గుర్తింపుగా  2024 ఎడిషన్‌ను న్యూజిల్యాండ్‌లో నిర్వహించేందుకు సమ్మతిని వ్యక్తం చేస్తున్నాం” అని బిడబ్ల్యుఎఫ్ పేర్కొంది. 2021, 2022, 2023 ఛాంపియన్‌షిప్‌లకు ఆతిథ్య దేశాల జాబితాను 2018లోనే బిడబ్ల్యుఎఫ్ కౌన్సిల్ ఫైనల్ చేసింది. దీంతో 2024 లో ఈ టోర్నమెంట్‌ను న్యూజిలాండ్ నిర్వహిస్తుంది.