Perimenopause: మహిళల్లో మోనోపాజ్‌ కష్టాలు.. 30 ఏళ్ల నుంచే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

సాధారణంగా మహిళలు యాభైకి చేరుకున్న తర్వాత మెనోపాజ్ ప్రారంభమవుతుంది. ఈ దశలో మహిళల శరీరంలో వివిధ మార్పులు సంభవిస్తాయి. హార్మోన్ల మార్పుల వల్ల బరువు పెరగడం, చిరాకుకు దారితీస్తాయి. రుమటాయిడ్ సమస్య సైతం వస్తుంది. చర్మం కాంతిహీణంగా మారడం, పలచబడిన జుట్టుతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మెనోపాజ్ గురించి తెలిసినప్పటికీ.. చాలా మంది మహిళలు శరీరంలో..

Perimenopause: మహిళల్లో మోనోపాజ్‌ కష్టాలు.. 30 ఏళ్ల నుంచే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Perimenopause
Follow us

|

Updated on: May 10, 2024 | 9:31 PM

సాధారణంగా మహిళలు యాభైకి చేరుకున్న తర్వాత మెనోపాజ్ ప్రారంభమవుతుంది. ఈ దశలో మహిళల శరీరంలో వివిధ మార్పులు సంభవిస్తాయి. హార్మోన్ల మార్పుల వల్ల బరువు పెరగడం, చిరాకుకు దారితీస్తాయి. రుమటాయిడ్ సమస్య సైతం వస్తుంది. చర్మం కాంతిహీణంగా మారడం, పలచబడిన జుట్టుతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మెనోపాజ్ గురించి తెలిసినప్పటికీ.. చాలా మంది మహిళలు శరీరంలో సంభవించే ఈ మార్పులకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండరు. ఆకస్మిక శారీరక మార్పులు అందరికీ అసౌకర్యంగా అనిపిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం. మహిళలు 30 తర్వాత తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే 50 ఏళ్ల వయసులో మెనోపాజ్‌ను సమర్దవంతంగా ఎదుర్కొనగలరని చెబుతున్నారు.

ఆహారం చాలా ముఖ్యం

మహిళలు ఎప్పుడూ తమను తాము కొంచెం తక్కువగా చూసుకుంటారు. కుటుంబంలోని భర్త, పిల్లలకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వరు. దీంతో మహిళలు తరచుగా పోషకాహార లోపంతో బాధపడుతుంటారు. కాబట్టి 30 లేదా 40 ఏళ్ల వయసులోనే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, గుడ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలి. సమతుల్య ఆహారాన్ని అనుసరించడం ద్వారా శరీరంలో పోషకాహార లోపం తలెత్తదు. చక్కెర, కేలరీలు ఉన్న ఆహారాన్ని పూర్తిగా నివారించాలి. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

బరువు నియంత్రణ

మెనోపాజ్ తర్వాత శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. ముఖ్యంగా శరీర దిగువ భాగం బరువుగా ఉంటుంది. అప్పుడు ఎముకల క్షీణత, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే శరీర బరువును సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మొదటి నుండి శారీరక వ్యాయామం, యోగా చేస్తే.. 50 తర్వాత పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి

తగినంత నిద్ర ఉండాలి

రోజంతా కష్టపడి పనిచేసినా కొంత మందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. నిద్రలేమితో బాధపడితే బహుళ శారీరక సమస్యలు తలెత్తుతాయి.

జననేంద్రియ ఆరోగ్యం

చాలా మంది రుతువిరతి, యోని ప్రాంతంలో పొడిబారడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను నివారించాలనుకుంటే వైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించాలి. ప్రధానంగా హార్మోన్ల మార్పుల వల్ల జననేంద్రియ అవయవాల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

మానసిక ఆరోగ్యం

మెనోపాజ్ దశకు చేరుకున్నప్పుడు, చర్మ వృద్ధాప్యాన్ని నివారించడానికి చాలా మంది పార్లర్‌లను ఆశ్రయిస్తుంటారు. తెల్లబడిన జుట్టును రంగుతో కప్పిపుచ్చుతారు. వీటితో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక మూడ్ స్వింగ్స్, చిరాకు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే 30 తర్వాత తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ