
కరోనా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సోకుతుందే తెలియని పరిస్థితి ఏర్పడింది. కొందరికి లక్షణాలు లేకుండానే కోవిడ్-19 పాజిటివ్ అని వస్తోంది. సొంతవాళ్లను కూడా నమ్మడం కష్టంగా మారింది. ఈ ప్రమాదకర వైరస్ మనుషులపై మానసికంగా కూడా దాడి చేస్తోంది. అందుకే ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో తనకు కరోనా పాజిటివ్ అని తెలిసి గుండె పగిలేలా రోదించింది ఓ మహిళ.
బీజింగ్‌లో షిజింగ్షాన్ వాండా ప్లాజాలోని ఒక మహిళ ఫోన్ మాట్లాడుతూ…ఒక్కసారిగా పెద్దగా అరస్తూ ఏడవడం ప్రారంభించింది. ఆమె అరుపులు విన్న అక్కడి ప్రజలు భయాందోళలనకు గురయ్యారు. ఆమెకు ఏమైందా అని పరీక్షిస్తూ చూశారు. ఇంతలో తనకు కరోనా టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందంటూ పెద్దగా ఏడ్వసాగింది. ఇది తెలియగానే అక్కడివాళ్లంతా అక్కడినుంచి పరుగులు తీశారు. ఆ మహిళ మాత్రం అక్కడే కూలబడి ఏడ్వసాగింది. ఇదంతా అక్కడ ఉన్న వీడియోలో రికార్డయ్యింది. ఆ తర్వాత పీపీఈ కిట్లు ధరించిన మెడికల్ సిబ్బంది వచ్చి ఆమెను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
Aye~ https://t.co/Rk4mCjv66s pic.twitter.com/aCnza9XIxX
— Petroselinum crispum (@sanverde) July 2, 2020
Another angle~ pic.twitter.com/TMtJhcMVJl
— Petroselinum crispum (@sanverde) July 2, 2020