ఇంగ్లాండ్ వెర్సస్ విండీస్: మొదటి టెస్టులో కరేబియన్లదే ఆధిక్యం..

|

Jul 11, 2020 | 7:15 PM

కరోనా వైరస్ కారణంగా సుమారు 117 రోజుల తర్వాత మొదలైన తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 102 ఓవర్లలో 318 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్  బ్రాత్‌వైట్‌ (65), వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ (61) రాణించడంతో కరేబియన్లు 114 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌కు నాలుగు, జేమ్స్‌ అండర్సన్‌కు మూడు, బెస్‌కు రెండు వికెట్లు […]

ఇంగ్లాండ్ వెర్సస్ విండీస్: మొదటి టెస్టులో కరేబియన్లదే ఆధిక్యం..
Follow us on

కరోనా వైరస్ కారణంగా సుమారు 117 రోజుల తర్వాత మొదలైన తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 102 ఓవర్లలో 318 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్  బ్రాత్‌వైట్‌ (65), వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ (61) రాణించడంతో కరేబియన్లు 114 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌కు నాలుగు, జేమ్స్‌ అండర్సన్‌కు మూడు, బెస్‌కు రెండు వికెట్లు దక్కాయి. అటు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ప్రస్తుతం ఒక వికెట్ నష్టపోయి 79 పరుగులు చేసింది. బర్న్స్(42) పరుగులకు ఔట్ అయ్యాడు. అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. స్టోక్స్, బట్లర్, బెస్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 6 వికెట్లు, గ్యాబ్రియల్ 4 వికెట్లు పడగొట్టారు.