ట్రంప్ కన్నా కాస్త ఆధిక్యతలో జో బైడెన్

అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కన్నా డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కొంతవరకు ఆధిక్యతలో ఉన్నారు. జో బైడెన్ కి 227 ఎలెక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ 213 ఓట్లతో డీలా పడ్డారు.

ట్రంప్ కన్నా కాస్త ఆధిక్యతలో జో బైడెన్

Edited By:

Updated on: Nov 05, 2020 | 10:52 AM

అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కన్నా డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కొంతవరకు ఆధిక్యతలో ఉన్నారు. జో బైడెన్ కి 227 ఎలెక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ 213 ఓట్లతో డీలా పడ్డారు. ఇక అలాస్కా, ఆరిజోనా, జార్జియా రాష్ట్రాల ఫలితాలు తేలవలసి ఉంది. ఆరిజోనాలో బైడెన్, అలాస్కాలో ట్రంప్ లీడ్ లో ఉన్నారు. , జార్జియా విషయానికి వచ్చ్చేసరికి  చివరి నిముషంలో  ట్రెండ్ మారింది. ఇక్కడ జో బైడెన్ హవా కాస్త కనిపించింది. దీంతో ఓట్ల లెక్కింపును మళ్ళీ చేపట్టాలని ట్రంప్ డిమాండ్  చేస్తున్నారు. ఈ మేరకు కోర్టుకెక్కే యోచనలో ఉన్నారు.