ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం విచారణ.. చెత్త పిటిషన్ వేశారంటూ..

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2019 | 3:44 PM

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ న్యామవాది ఎమ్ఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది ఎమ్ఎల్ శర్మపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కనీస స్పష్టత లేకుండా.. అత్యంత ముఖ్యమైన అంశంపై చెత్త పిటిషన్ వేశారని చివాట్లు పెట్టింది. మీ పిటిషన్ అరగంటకు పైగా చదివినా అర్థం కాలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో […]

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం విచారణ.. చెత్త పిటిషన్ వేశారంటూ..
Follow us on

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ న్యామవాది ఎమ్ఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది ఎమ్ఎల్ శర్మపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కనీస స్పష్టత లేకుండా.. అత్యంత ముఖ్యమైన అంశంపై చెత్త పిటిషన్ వేశారని చివాట్లు పెట్టింది. మీ పిటిషన్ అరగంటకు పైగా చదివినా అర్థం కాలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తామని.. భద్రతా దళాలపై నమ్మకం ఉంచాలన్న కేంద్రం వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. కాగా, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లోని జర్నలిస్టులపై ఆంక్షలు విధించారంటూ కశ్మీర్ టైమ్స్ సంపాదకురాలు అనురాధా బాసిన్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వచ్చేవారం కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.