david warner butta bomma : బుట్టబొమ్మతో తెలుగు ప్రజలకు దగ్గరైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి వార్నర్.. మరోసారి ట్వీట్ చేశాడు. అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట, మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం 450 మిలియన్ల మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్ వార్నర్.. వెల్డన్ అల్లు అర్జున్ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.
‘బుట్టబొమ్మ’ సాంగ్‌పై స్టెప్పులేసిన వార్నర్ ఫ్మామిలీ తెలుగు ప్రజల్లో కలిసిపోయింది. లాక్డౌన్లో ఆటలన్నీ నిలిచిపోవడం వల్ల క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆ సమయంలో టిక్‌టాక్‌లు చేస్తూ అభిమానులకు వార్నర్ కుటుంబం దగ్గరయ్యింది.
ఈ క్రమంలోనే ‘బుట్టబొమ్మ’, ‘మైండ్‌బ్లాక్’ లాంటి తెలుగు పాటలకు డ్యాన్స్ చేసి టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా చేరువయ్యారు. ఇటీవల ఐపీఎల్లో తమ జట్టు ఫైనల్‌కు వెళ్తే ‘బుట్టబొమ్మ’ స్టెప్పు వేస్తానని వార్నర్ ఓ నెటిజన్ కామెంట్‌కు రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ హైదరాబాద్ జట్టు క్వాలిఫయర్-2లో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో వార్నర్ అభిమానులు నిరాశ చెందారు.