బాలీవుడ్‌ హీరోల ‘వార్‌’లో.. ‘సైరా’ గెలుస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రామ్ చరణ్ నిర్మించాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజైన అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫీస్ట్ అని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో బాక్స్ ఆఫీస్ బాద్ షా […]

బాలీవుడ్‌ హీరోల 'వార్‌'లో.. 'సైరా' గెలుస్తాడా..?
Follow us

|

Updated on: Oct 02, 2019 | 5:40 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రామ్ చరణ్ నిర్మించాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక రిలీజైన అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫీస్ట్ అని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో బాక్స్ ఆఫీస్ బాద్ షా గా వెలుగుతున్న చిరంజీవి.. ఈ సినిమాతో మరోసారి తన సత్తాను చాటాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.

చిరు సినిమా. అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ కావడం.. చిన్న సినిమాలన్నీ పోటీ నుంచి తప్పుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ‘సైరా’ వార్ వన్ సైడ్ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు బాహుబలి రికార్డుల మీద కన్నేసిందని చెప్పొచ్చు. మొదటి భాగంలో కొన్ని సాగతీత సన్నివేశాలు తప్పించి.. మిగతాదంతా కూడా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది.

ఇది ఇలా ఉంటే బాలీవుడ్‌లో మాత్రం ‘సైరా’కు ఇద్దరు యాక్షన్ హీరోస్ ‘వార్’ ప్రకటించారు. వారు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్’. ఈ చిత్రం కూడా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ‘వార్’కు పాజిటివ్ టాక్ వచ్చిందని తెలుస్తోంది. 154 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ పూర్తిగా యాక్షన్ ప్రియుల కోసం తెరకెక్కిందని చెప్పొచ్చు. హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఫ్యాన్స్‌ను థ్రిల్ కలిగించే విధంగా ఉందని బీ-టౌన్ టాక్. హృతిక్ రోషన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అతడి సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. భాషాభేదం లేకుండా జనాలు అతడి చిత్రాలను ఆదరిస్తారు.

అయితే ఈ చిత్రం పూర్తిగా యాక్షన్‌తోనే ఉండటంతో.. కొందరికి పెద్దగా నచ్చకపోవచ్చని టాక్ నడుస్తోంది. ఇదే ‘సైరా’కు కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు హిందీలో ‘బాహుబలి’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘సైరా’ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇకపోతే ‘వార్’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ‘సైరా’ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడకపోవచ్చని సమాచారం. అంతేకాక బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హీరో ఫర్హాన్ అక్తర్‌లు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. అటు హిందీ క్రిటిక్స్ సైతం సైరాను పొడుగుతూ అద్భుతమైన రివ్యూస్ ఇవ్వడం గమనార్హం. ఏది ఏమైనా హిందీలో మెగాస్టార్ మరోసారి తనదైన మార్క్‌ను చూపించబోతున్నాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Latest Articles
మేషరాశిలో బుధుడు అడుగు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
మేషరాశిలో బుధుడు అడుగు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. అసలు కథ ఇదే..
ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. అసలు కథ ఇదే..
చిరుతనా.. కోహ్లీనా.. షాకింగ్ రనౌట్‌తో బిత్తరబోయిన పంజాబ్ బ్యాటర్
చిరుతనా.. కోహ్లీనా.. షాకింగ్ రనౌట్‌తో బిత్తరబోయిన పంజాబ్ బ్యాటర్
అక్షయ తృతీయ రోజు పసిడే ఆమె ప్రాణాలు తీసింది..
అక్షయ తృతీయ రోజు పసిడే ఆమె ప్రాణాలు తీసింది..
అక్షయ తృతీయ ఎఫెక్ట్‌..మహిళలకు షాకింగ్- భారీగా పెరిగిన బంగారం ధరలు
అక్షయ తృతీయ ఎఫెక్ట్‌..మహిళలకు షాకింగ్- భారీగా పెరిగిన బంగారం ధరలు
కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!!
కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!!
వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే
వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే
రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్
రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..