మీ ఈవీఎంలు సూపర్.. ఆస్ట్రేలియా కితాబు

| Edited By:

May 13, 2019 | 9:48 AM

ఓ వైపు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుండగా.. మరోవైపు విదేశాల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారిగా ఉన్న హరీందర్ సిధు… ఈవీఎంలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో ఆదివారం ఆరో విడత పోలింగ్‌ను ఆమె నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలు చాలా బాగున్నాయని, ఇలాంటి వ్యవస్థ తమ దగ్గర లేదన్నారు. ఏ సిస్టమ్‌లోనైనా ఇబ్బందులు ఉంటూనే ఉంటాయని.. కానీ వీవీ ప్యాట్‌లు జోడించడం మంచి […]

మీ ఈవీఎంలు సూపర్.. ఆస్ట్రేలియా కితాబు
Follow us on

ఓ వైపు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుండగా.. మరోవైపు విదేశాల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారిగా ఉన్న హరీందర్ సిధు… ఈవీఎంలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో ఆదివారం ఆరో విడత పోలింగ్‌ను ఆమె నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలు చాలా బాగున్నాయని, ఇలాంటి వ్యవస్థ తమ దగ్గర లేదన్నారు. ఏ సిస్టమ్‌లోనైనా ఇబ్బందులు ఉంటూనే ఉంటాయని.. కానీ వీవీ ప్యాట్‌లు జోడించడం మంచి నిర్ణయమని అన్నారు. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. ఇంతమంది ఓటర్లతో ఇదెలా సాధ్యమవుతుందని ఆశ్చర్యపోయిన ఆమె.. భారత ఎన్నికల సంఘం పనితీరు అద్భుతమని తెలిపారు.