పార్టీల మధ్య బూతు పంచాయితీ.. స్టార్ట్ చేసింది ఇతనే!

| Edited By:

Jan 11, 2020 | 9:31 PM

ఈ మధ్య రాజకీయ పార్టీల్లో బూతు పంచాయతీలు ఎక్కువయ్యాయి. ఏ నేత నోరు తెరిచినా.. ముందుగా అవే వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ఓ చిన్న మాట అంటేనే.. వాటిని రికార్డుల్లోనుంచి తొలగించాలని పెద్ద ఎత్తున పట్టుపడుతూంటారు. కానీ.. ఇప్పుడు పబ్లిక్‌గానే మాట్లాడేస్తున్నారు. టీడీపీ మాజీ అధ్యక్షుడు చంద్రబాబుపై, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఓ వైసీపీ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాస్తా తీవ్ర దుమారంగా మారాయి. ఆ వ్యాఖ్యలు వింటుంటే జనసేన, […]

పార్టీల మధ్య బూతు పంచాయితీ.. స్టార్ట్ చేసింది ఇతనే!
Follow us on

ఈ మధ్య రాజకీయ పార్టీల్లో బూతు పంచాయతీలు ఎక్కువయ్యాయి. ఏ నేత నోరు తెరిచినా.. ముందుగా అవే వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ఓ చిన్న మాట అంటేనే.. వాటిని రికార్డుల్లోనుంచి తొలగించాలని పెద్ద ఎత్తున పట్టుపడుతూంటారు. కానీ.. ఇప్పుడు పబ్లిక్‌గానే మాట్లాడేస్తున్నారు.

టీడీపీ మాజీ అధ్యక్షుడు చంద్రబాబుపై, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఓ వైసీపీ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాస్తా తీవ్ర దుమారంగా మారాయి. ఆ వ్యాఖ్యలు వింటుంటే జనసేన, టీడీపీ నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో.. ఆ ఎమ్మెల్యేకు ఫుల్ కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే ఆ ఎమ్మెల్యేపై పోలీసు కేసు నమోదు చేశారు టీడీపీ నేతలు. తక్షణమే ఆ ఎమ్మెల్యేపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గతకొద్ది రోజుల నుంచి అమరావతిలో రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా చంద్రబాబు జోలెపట్టి.. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీంతో.. ఆయనపై అధికార మంత్రులు, ఎమ్మెల్యేలు ఫుల్ ఫైయర్ అవుతున్నారు. ఆయన జోలె పట్టి భిక్షాటన చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు? రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావొద్దా అని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ మరో అడుగు ముందుకేసి.. ఆయనపై తీవ్రమైన అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. కనీసం అవి రాయడానికి కూడా వీలులేని బండ బూతులను తిట్టారు. అలాగే.. పవన్‌ కళ్యాణ్‌పై కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు.

ఇందుకు జనసేన నేతలు, టీడీపీ నేతలు కూడా అదే విధంగా కౌంటర్ ఇచ్చారు. దీనిపై జనసేన ఇంచార్జ్ కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సంస్కారం లేని వ్యక్తుల్లా వైసీపీ నేతలు బిహేవ్ చేస్తున్నారన్నారు. సరైన పరిపాలన అందించడం చేతకాదు కానీ.. వ్యక్తుల్ని దూషిస్తారా? అంటూ విమర్శించారు. మరో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అరే పిచ్చనా కొడకా.. గాలినా కొడకా.. నన్ను ఎక్కడికి రమ్మంటావో చెప్పు వస్తా.. పిచ్చ ల### అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. నీ బ్రతుకేంటో రాజమండ్రి ప్రజలకు తెలుసన్నారు. పవన్‌ను ఎక్కువగా తిడితే మంత్రి పదవి వస్తుందోమో అనుకుంటున్నావేమో.. ఎమ్మెల్యే పదవి కూడా ఊడేలా చేస్తామంటూ ఘాటుగా కౌటర్ ఇచ్చారు. మూడు రాజధానుల అంశం ఎక్కడా లేదు. పవన్‌పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. రైతు శ్రేయస్స కోసం జనసేన కట్టుబడి ఉందన్నారు.

జనసేన పీసీ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు మాట్లాడిన వ్యాఖ్యలకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు. నవరత్నాలు సరిగా అమలు చేయలేకనే.. ఇలా పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్ర డీజీపీ చట్టంకు లోబడి పనిచేయాలని.. అమరావతిలో మహిళలపై జరుగుతోన్న దాడులకు విజయమ్మ, షర్మిల స్పందించాలని పోతిన వెంకట్ డిమాండ్ చేశారు.