కొత్త కలర్‌ జెర్సీలో టీమిండియా క్రికెట్‌ ప్లేయర్లు..!

|

Nov 12, 2020 | 3:32 PM

టీమిండియా జెర్సీలు చూసి చూసి బోర్‌ కొట్టేసిందా? నైంటీస్‌లో వేసుకున్న కలర్‌ దుస్తులే బాగున్నాయనిపిస్తోందా? ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి మీరనుకున్న కలర్‌ జెర్సీలో..

కొత్త కలర్‌ జెర్సీలో టీమిండియా క్రికెట్‌ ప్లేయర్లు..!
Follow us on

టీమిండియా జెర్సీలు చూసి చూసి బోర్‌ కొట్టేసిందా? నైంటీస్‌లో వేసుకున్న కలర్‌ దుస్తులే బాగున్నాయనిపిస్తోందా? ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి మీరనుకున్న కలర్‌ జెర్సీలో భారత ఆటగాళ్లు కనిపించబోతున్నారు.. వన్డే, టీ-20 మ్యాచ్‌లలో కొత్త జెర్సీని ధరించబోతున్నారు. తొమ్మిదో దశకంలోలాగే జెర్సీలు నేవీ బ్లూ కలర్‌లో ఉండబోతున్నాయి.. మొన్నటి వరకు వాడిన నీలాకాశపు రంగు మారుతుంది.. ఆ ప్లేస్‌లో ముదురు నీలం రంగు రాబోతున్నది.. ఆ జెర్సీపై తెలుగు, ఎరుపు, ఆకపచ్చ రంగుల్లో స్ట్రిప్స్‌ ఉన్నాయి.. ఇంతకు ముందు భారత క్రికెటర్లకు నైకీ స్పాన్సర్‌గా ఉండేది.. ఇప్పుడా సంస్థ పక్కకు తప్పుకోవడంతో ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.. బీసీసీఐతో ఒప్పందం కూడా చేసుకుంది.. ఈ ఒప్పందం ప్రకారం టీమిండియా ప్లేయర్లకు కొత్త కిట్లను, కొత్త జెర్సీలను అందచేస్తుంది.. మరోవైపు క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా తమ ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీలను సిద్ధం చేసింది.. ఈ నెల 27 నుంచి మూడు వన్డేల సిరీస్‌ మొదలవుతుంది.. డిసెంబర్‌ నాలుగు నుంచి టీ-20 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి..