తోటి ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్న విరాట్ కోహ్లీ

|

Sep 02, 2020 | 1:22 PM

‘బయో సెక్యూర్‌ బబుల్‌’ నిబంధనలు అనుసరించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. అన్నీ మరచి ఆటపైనే దృష్టి పెట్టాలని సహచరులకు సూచనలు విరాట్.

తోటి ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్న విరాట్ కోహ్లీ
Follow us on

‘బయో సెక్యూర్‌ బబుల్‌’ నిబంధనలు అనుసరించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. అన్నీ మరచి ఆటపైనే దృష్టి పెట్టాలని సహచరులకు సూచనలు విరాట్. ‘మేమందరం ఇక్కడ క్రికెట్‌ ఆడటానికి వచ్చాం. టోర్నమెంట్‌ సాఫీగా సాగాలంటే ప్రతీ ఒక్కరు బయో బబుల్‌ నిబంధనలు గౌరవించాల్సిందే. ఏదో సరదాగా గడిపేందుకు మనం రాలేదు. నేను హాయిగా దుబాయ్‌ వీక్షించి వస్తానంటే కుదరదు అంటూ తోటి ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్.

ఐపీఎల్ ఆరంభం నుంచి విజయం అంచుల దాకా వెళ్లి వెనక్కు తిరిగిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇందుకు తగ్గట్టుగా జట్టును రెడీ చేస్తున్నారు కెప్టెన్ విరాట్. అంత గొప్ప పరిస్థితుల్లో మనం ప్రస్తుతం లేము. ఎలాంటి దశను దాటుతున్నామో అర్థం చేసుకోవాలి. ఒక రకంగా మనం అదృష్టవంతులం. ఇంత కఠోర పరిస్థితుల్లోనూ ఐపీఎల్‌ ఆడే అవకాశం లభించింది. ఇతర పరిస్థితులు మనల్ని నియంత్రించేలా వ్యవహరించవద్దు’ అని కోహ్లి తన సహచరులకు ఉద్బోధ చేశాడు. బహుశా చాలా ఏళ్లుగా విరామం లేకుండా ఆడుతుండటం వల్ల ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నా తనకు ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదని కోహ్లి అన్నాడు. రెండు నెలల క్రితం అసలు ఐపీఎల్‌ జరిగే అవకాశం లేదని భావించామని… ఇప్పుడు మళ్లీ లీగ్‌లో ఒక్క చోట చేరడం సంతోషంగా ఉందని అతను అభిప్రాయ పడ్డాడు.