రికార్డుల రారాజుగా కొనసాగుతున్న విరాట్.. తాజాగా మరో రికార్డును సాధించిన టీమిండియా కెప్టెన్

టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే రికార్డుల రారాజుగా కొనసాగుతున్న విరాట్ తాజాగా సచిన్ రికార్డును బ్రేక్ చేసాడు.

రికార్డుల రారాజుగా కొనసాగుతున్న విరాట్.. తాజాగా మరో రికార్డును సాధించిన టీమిండియా కెప్టెన్

Updated on: Dec 02, 2020 | 11:36 AM

టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే రికార్డుల రారాజుగా కొనసాగుతున్న విరాట్ తాజాగా సచిన్ రికార్డును బ్రేక్ చేసాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఘనత సాధించాడు.

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న ఈ రికార్డును ఇప్పుడు కోహ్లీ బీట్ చేసాడు. సచిన్ 300 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను అందుకున్నాడు. అయితే విరాట్ 242వ ఇన్నింగ్స్‌లో12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. విరాట్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో 22 వేల పరుగులను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.12 వేల పరుగులు చేసిన వారిలో విరాట్, సచిన్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్‌(314), కుమార సంగక్కర(336), సనత్‌ జయసూర్య(379),  మహేల జయవర్దనే(399) ఉన్నారు.