‘విరుష్కడివోర్స్’ తీసుకున్నారట..!

ఇండియన్ క్రికిట్ కెప్టెన్ విరాట్- అనుష్క విడాకులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వైరల్ కావడంతో సంచలనంగా మారింది. శుక్రవారం ట్విట్టర్‌లో వైరల్ అయిన ఓ హ్యాష్‌ట్యాగ్ నెటిజన్లను టెన్షన్ కి గురిచేసింది

‘విరుష్కడివోర్స్’ తీసుకున్నారట..!

Edited By:

Updated on: Jun 06, 2020 | 4:39 PM

ఇండియన్ క్రికిట్ కెప్టెన్ విరాట్- అనుష్క విడాకులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వైరల్ కావడంతో సంచలనంగా మారింది. శుక్రవారం ట్విట్టర్‌లో వైరల్ అయిన ఓ హ్యాష్‌ట్యాగ్ నెటిజన్లను టెన్షన్ కి గురిచేసింది. ‘విరుష్కడివోర్స్’ అంటూ ట్విట్టర్‌లో శుక్రవారం రాత్రి ఓ హ్యాగ్‌ట్యాగ్ వైరల్ అయింది. 2016లో ఓ వెబ్‌సైట్‌ రాసిన ఫేక్ న్యూస్‌ని చూసిన కొందరు నెటిజన్లు.. అసలు విషయం తెలుసుకోకుండా ఈ హ్యాష్‌ట్యాగ్‌ని వైరల్ చేశారు. ఒక్కసారిగా ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్ఠింది. ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ గురయ్యారు. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే నంద్‌కిషోర్ గుర్జార్ కూడా విరాట్.. అనుష్క‌కు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విరాట్, అనుష్కల విడాకులకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్ వైరల్ కావడం మరింత సంచలనంగా మారింది. అయితే ఇది ఫేక్‌న్యూస్ అని ఎవరో ఆకతాయి హ్యాష్ ట్యాగ్ తో గందరగోళానికి గురిచేసిందని స్పష్టత ఇవ్వడంతో పరిస్థితి కూల్ గా మారింది. అంతేకాక.. పలువురు ఈ విషయంపై మీమ్స్ చేసి.. నెటిజన్లను మరింత ప్రోత్సహించారు.