Snake Bite: అతడిని నీడలా వెంటాడుతోన్న కోడె నాగు.. ఏడునెలల్లో ఏడుసార్లు కాటేసింది..

| Edited By: Ram Naramaneni

Apr 18, 2022 | 11:10 AM

Snake Bite: పాము అంటేనే అందరికీ వెన్నులో వణుకుపుడుతుంది. పాము కనిపిస్తే చాలు వెంటనే పరుగులు పెడతారు. అలాంటిది ఒక కోడెనాగు ఒకరిపై పగబట్టింది. అతడిని నీడలా వెంటాడుతూ ఏకంగా ఏడుసార్లు కాటేసింది.

Snake Bite: అతడిని నీడలా వెంటాడుతోన్న కోడె నాగు.. ఏడునెలల్లో ఏడుసార్లు కాటేసింది..
Follow us on

Snake Bite: పాము అంటేనే అందరికీ వెన్నులో వణుకుపుడుతుంది. పాము కనిపిస్తే చాలు వెంటనే పరుగులు పెడతారు. అలాంటిది ఒక కోడెనాగు ఒకరిపై పగబట్టింది. అతడిని నీడలా వెంటాడుతూ ఏకంగా ఏడుసార్లు కాటేసింది. ఉత్తరప్రదేశ్ (UttarPradesh) లోని రాంపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాగా ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. యూపీలోని రాంపూర్‌ జిల్లాలో స్వర్ అనే గ్రామంలో ఎహ్సాన్ అలియాస్‌ బబ్లూ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను ఏడునెలల క్రితం అనుకోకుండా ఓ పామును చంపేశాడు. కొన్ని నెలల క్రితం ఓ పాము అలీని కాటేసిందట. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో తప్పించుకున్నాడు. రెండోసారి కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌. అదే పాము కాటేసింది. సకాలంలో చికిత్స అందజేయడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. మూడోసారి కూడా అదే జరిగింది. ఇలా ఏడు సార్లు జరిగిందట. ఇలా ఒకే పాము తరచూ తనపై దాడి చేస్తుండడంతో అది తనపై పగ బట్టిందని ఎహ్సాన్ గుర్తించాడు.

భయంతో పని మానేశాను!

ఈ విషయంపై బాధితుడు మాట్లాడుతూ ‘కొన్ని రోజుల క్రితం నాకు రెండు పాములు కనిపించాయి. అందులో ఒకదానిని చంపి భూమిలో పాతిపెట్టాను. అయితే మరో జంట పాము నాపై పగబట్టింది. కూలి పనుల కోసం వెళ్లినప్పుడు నన్ను చాలా సార్లు కరిచింది. ఆ పాముభయంతో పని కెళ్లడం కూడా మానేశాను. నాకు నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. పనికి వెళ్లకపోవడంతో వారినెలా పోషించాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నేను పూర్తి భయాందోళనతో జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

(Note: జాతీయ మీడియాల్లోని వార్తా కథనాల ఆధారంగా కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే ఈ ఆర్టికల్ ను ప్రచురించాము. ఇందులో పేర్కొన్న వివరాలను టీవీ9 నేరుగా ధృవీకరించుకోలేదు)

Also Read:JP Nadda: బీజేపీ ఉన్నచోట మిషన్‌.. కాంగ్రెస్‌ ఉన్నచోట కమిషన్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా

TS High Court Recruitment 2022: రూ.63 వేల జీతంతో.. తెలంగాణలో జిల్లా జడ్జి పోస్టులకు నోటిఫికేషన్‌..పూర్తి వివరాలు..

Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..