వనస్థలిపురం ఏసీపీపై బదిలీ వేటు

|

Aug 17, 2020 | 10:06 PM

వనస్థలిపురం ఏసీపీ జయరాంరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నారంటూ ఏసీపీపై పలు ఆరోపణలు ఉన్నాయి.

వనస్థలిపురం ఏసీపీపై బదిలీ వేటు
Follow us on

Vanasthalipuram ACP Transferred : వనస్థలిపురం ఏసీపీ జయరాంరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నారంటూ ఏసీపీపై పలు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కొంతమంది మహిళలను వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. జయరాంరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు 58 ఎకరాల భూమిపై నకిలీ పత్రాలు సృష్టించిన సానా సతీష్‌కు ఏసీపీ జయరాంరెడ్డి సాయం చేశారు.

నకిలీ పత్రాలతో 60 కోట్ల లోన్‌ తీసుకున్నాడు సానా సతీష్‌. సానా సతీష్‌ దగ్గర 20 లక్షలు జయరాంరెడ్డి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మొయిన్‌ ఖురేషి కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు సానా సతీష్‌.