అమెరికాలో కోవిడ్ 19 ‘విశ్వరూపం’, ఒక్క రోజులో లక్ష కేసుల నమోదు

అమెరికాలో కరోనావైరస్ తన ‘విశ్వరూపం’ చూపుతోంది. శుక్రవారం ఒక్కరోజే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అధ్యక్ష ఎన్నికలకు ఇక మూడు రోజులు మాత్రమే ఉండగా నిన్న  1,00.233 కేసులు రిజిస్టరయ్యాయి.  ఇటీవల ఒక్క రోజులో 91 వేలు ఉండగా దాన్ని ఈ సంఖ్య అధిగమించింది. ముఖ్యంగా 16 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి బెడద ఎక్కువగా ఉంది. (ఇండియాలో సెప్టెంబరు 17 న 97,894 కేసులు నమోదయ్యాయి). అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య మాస్క్ ధరించి ఎన్నికల […]

అమెరికాలో కోవిడ్ 19 విశ్వరూపం, ఒక్క రోజులో లక్ష కేసుల నమోదు

Edited By:

Updated on: Oct 31, 2020 | 9:07 PM

అమెరికాలో కరోనావైరస్ తన ‘విశ్వరూపం’ చూపుతోంది. శుక్రవారం ఒక్కరోజే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అధ్యక్ష ఎన్నికలకు ఇక మూడు రోజులు మాత్రమే ఉండగా నిన్న  1,00.233 కేసులు రిజిస్టరయ్యాయి.  ఇటీవల ఒక్క రోజులో 91 వేలు ఉండగా దాన్ని ఈ సంఖ్య అధిగమించింది. ముఖ్యంగా 16 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి బెడద ఎక్కువగా ఉంది. (ఇండియాలో సెప్టెంబరు 17 న 97,894 కేసులు నమోదయ్యాయి). అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య మాస్క్ ధరించి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆయన ర్యాలీల్లో ఎక్కడా ఆయన మద్దతుదారులు ఇది ధరించి పాల్గొన్న దాఖలాలు లేవు. ఇక భౌతిక దూరం మాట ఊసే లేదు. కరోనా వైరస్ అదుపులో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అదేపనిగా ఆరోపిస్తున్న విషయం గమనార్హం. ట్రంప్ పాల్గొన్న 18 ఎన్నికల ర్యాలీల్లో 30 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదైనట్టు సమాచారం.