జనవరి 1 నుంచి అమలోకి వచ్చిన కొత్త రూల్స్.. మీపై ఎఫెక్ట్ పడనుందా.? ఓ లుక్కేయండి.!

Rules Change From Jan 1: ఎన్నో ఆశలు, ఇంకెన్నో గోల్స్‌తో 2021 సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. కొత్త ఏడాదిలో కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి...

జనవరి 1 నుంచి అమలోకి వచ్చిన కొత్త రూల్స్.. మీపై ఎఫెక్ట్ పడనుందా.? ఓ లుక్కేయండి.!

Updated on: Jan 01, 2021 | 12:48 PM

Rules Change From Jan 1: ఎన్నో ఆశలు, ఇంకెన్నో గోల్స్‌తో 2021 సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. కొత్త ఏడాదిలో కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. అవి చాలామందిపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఎల్పీజీ నుంచి ఫాస్టాగ్ దాకా.. జీఎస్టీ నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు చాలా అంశాలు మారాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.యూపీఐ చెల్లింపులకు అదనపు ఛార్జీలు…

ఇక నుంచి యూపీఐ చెల్లింపులు వినియోగదారుడికి భారం కానున్నాయి. 2021 జనవరి 1 నుంచి అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ నిర్వహించే UPI అప్లికేషన్స్‌పై అదనపు ఛార్జీలు విధించాలని నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.

2. కాంటాక్ట్‌లెస్ కార్డు పేమెంట్ పరిమితులు పెంపు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచిన కాంటాక్ట్‌లెస్ కార్డు పేమెంట్ పరిమితులు ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. దీనితో ఇకపై కాంటాక్ట్‌లెస్ కార్డు ద్వారా ఎలాంటి పిన్ లేకుండానే రూ. 5,000 వరకు లావాదేవీలు నిర్వహించవచ్చు.

3. ఫాస్టాగ్ తప్పనిసరి..

2021 జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే డిసెంబర్ 31వ తేదీన ఆ గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

4. డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్ తప్పనిసరి..

జనవరి 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి సవరించిన మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ. 5 వేలు జరిమానా విధించనున్నారు.

5. జీఎస్టీ రిటర్న్స్- చిన్న వ్యాపారాలు..

జనవరి 2021 నుంచి రూ. 5 కోట్లు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారాలు 12కు బదులుగా నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్న్స్ చెల్లించాలి. ఇది సుమారు 94 లక్షల పన్ను చెల్లింపుదారులకు వర్తించనుంది.

6. ఇవాళ్టి నుంచి కొన్ని మొబైల్స్‌లో వాట్సాప్ పని చేయదు..

ఐఓఎస్ 9 (IOS-9)​, ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్​ కన్నా.. పాత వెర్షన్స్‌తో నడుస్తున్న మొబైల్స్ జనవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.

వాట్సాప్ పని చేయని మొబైల్స్ ఇవే…
ఐఫోన్​ 4ఎస్, 5, 5ఎస్​, 5సీ, 6, 6ఎస్​ (iPhone 4S, 5, 5S, 5C, 6 and 6S)​, ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్​ కన్నా పాత వెర్షన్​తో నడుస్తున్న మొబైల్స్

7. ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌కు కాల్ చేయాలంటే ‘0’ తప్పనిసరి..

ఇక నుంచి దేశంలో ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేసినప్పుడల్లా ప్రతీసారి తప్పనిసరిగా ‘0’ చేర్చాలి. ఈ కొత్త నిబంధన 2021 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.. దానికి అనుగుణంగా టెలికాం సంస్థలు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) గతంలోనే ఆదేశాలు ఇచ్చింది.

8. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ కీలక ఆదేశాలు..

ప్రజలందరికీ అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమలులోకి తీసుకురావాలని ఇన్సూరెన్స్ సంస్థలకు ఇప్పటికే ఐఆర్‌డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సంజీవని అనే పేరుతో ఈ పాలసీలు జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

9. కార్ల ధరలు మరింత ప్రియం..

కార్లు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. ఇవాళ్టి నుంచి కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్ ఇండియా జనవరి 1 నుండి తన వాహనాల ధరలను పెంచనున్నాయి.