‘సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతోనే అవంతి వెళ్లిపోయింది.!’

హైదరాబాద్ చందానగర్ కు చెందిన నవ వరుడు హేమంత్‌ హత్య కేసును పరువు హత్యగా తేల్చారు పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో కలిసి.. హత్య చేయించినట్లు తమ విచారణలో ఒప్పుకున్నట్టు తెలిపారు. హేమంత్ భార్య అవంతి మేనమామ యుగందర్‌రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఈ కేసులో కీలకమని తెలిపారు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తెలిసి అవంతి తండ్రి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడని.. ఆరు నెలల పాటు అవంతి బయటకు వెళ్లకుండా […]

'సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతోనే అవంతి వెళ్లిపోయింది.!'
Follow us

|

Updated on: Sep 28, 2020 | 4:04 PM

హైదరాబాద్ చందానగర్ కు చెందిన నవ వరుడు హేమంత్‌ హత్య కేసును పరువు హత్యగా తేల్చారు పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో కలిసి.. హత్య చేయించినట్లు తమ విచారణలో ఒప్పుకున్నట్టు తెలిపారు. హేమంత్ భార్య అవంతి మేనమామ యుగందర్‌రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఈ కేసులో కీలకమని తెలిపారు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తెలిసి అవంతి తండ్రి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడని.. ఆరు నెలల పాటు అవంతి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారని తేల్చారు.

అయితే జూన్‌ 10న ఇంట్లో కరెంట్‌ పోవడంతో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసి.. హేమంత్‌తో కలిసి అవంతి పారిపోయిందని వెల్లడించారు.హేమంత్‌ హత్య కేసులో మొత్తం 25మందిని గుర్తించిన పోలీసులు..నిందితులను 5రోజుల కస్టడీకి కోరుతూ ఎల్బీనగర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. జహీరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌ మీద సీసీ దృశ్యాలను కూడా సేకరించిన పోలీసులు ..వాటి ఆధారంగానూ దర్యాప్తు చేస్తున్నారు. వీటితోపాటు నిందితులను కస్డడీలోకి తీసుకొని సీన్‌ రీ కన్‌స్ట్రక్చన్‌ చేయాలని భావిస్తున్నారు. ఇదిలాఉంటే, అవంతి, హేమంత్‌ కుటుంబసభ్యులు సీపీ సజ్జనార్‌ను కలవనున్నట్లు సమాచారం.