Upasana Tweet About Mother Cycling: వైరల్‌గా మారిన ఉపాసాన ట్వీట్.. 60 ఏళ్ల వయసులో సైకిల్‌పై 600 కి.మీలు..

Upasana Tweet Mother Cycling Video: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో ఉపాసన ఒకరు. భర్త రామ్ చరణ్‌ సినిమా అప్‌డేట్‌లతో పాటు తన వ్యక్తిగత వివరాలను, ఆరోగ్య సూచనలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకోవడం..

Upasana Tweet About Mother Cycling: వైరల్‌గా మారిన ఉపాసాన ట్వీట్.. 60 ఏళ్ల వయసులో సైకిల్‌పై 600 కి.మీలు..

Updated on: Dec 30, 2020 | 6:43 PM

Upasana Tweet Mother Cycling Video: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో ఉపాసన ఒకరు. భర్త రామ్ చరణ్‌ సినిమా అప్‌డేట్‌లతో పాటు తన వ్యక్తిగత వివరాలను, ఆరోగ్య సూచనలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకోవడం ఉపాసనకు అలవాటు. ఈ క్రమంలో తాజాగా ఉపాసన తన తల్లికి సంబంధించి పోస్ట్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఉపాసన తల్లి పేరు శోభన కామినేని.. ప్రస్తుతం శోభన ఆపోలో ఆసుత్రులకు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే శోభన తాజాగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి సైకిల్‌పై ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. అది కూడా 60 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించడం విశేషం. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ నుంచి మొదలైన శోభన సైకిల్ ప్రయాణం.. చెన్నైలోని బిషాప్ గార్డెన్స్‌లో ముగిసింది. కేవలం ఆరు రోజుల్లోనే 642 కి.మీల దూరాన్ని సునాయాసంగా చేరుకున్నారు. ఈ లెక్కన చూస్తే శోభ సరాసరి రోజుకి వంద కిలోమీటర్లపైగా సైక్లింగ్ చేశారన్మానమాట. ఈ ఘనతను సాధించిన తన తల్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని ఉపాసన చెప్పుకొచ్చారు.

Also read: Sonu Sood News : వీరులు త‌యార‌వుతారు..పుట్ట‌ర‌ని మీ పుస్త‌కంతో మ‌రోసారి నిరూపించారు..