విమానం ఎక్కిన వ్యక్తి మధ్యలోనే కుప్పకూలిపోయాడు.. అతని కుటుంబసభ్యుల ఇచ్చిన సమాధానంలో ప్రయాణికులు అవాక్కయ్యారు.. ఎందుకబ్బా?

|

Dec 20, 2020 | 7:04 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు వైరస్ నుంచి ఎప్పుడు విమక్తి దొరుకుతుందాని జనం ఆశగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత కాలంలో ఆ పేరు వింటేనే ఆమడ దూరం వెళ్తున్న పరిస్థితి. అలాంటిది కరోనా సోకిన వ్యక్తి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విమానంలో ప్రయాణించాడు.

విమానం ఎక్కిన వ్యక్తి మధ్యలోనే కుప్పకూలిపోయాడు.. అతని కుటుంబసభ్యుల ఇచ్చిన సమాధానంలో ప్రయాణికులు అవాక్కయ్యారు.. ఎందుకబ్బా?
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు వైరస్ నుంచి ఎప్పుడు విమక్తి దొరుకుతుందాని జనం ఆశగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత కాలంలో ఆ పేరు వింటేనే ఆమడ దూరం వెళ్తున్న పరిస్థితి. అలాంటిది కరోనా సోకిన వ్యక్తి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విమానంలో ప్రయాణించాడు. అంతలోనే అతడు అస్వస్థతకు గురవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన అమెరికాలో వెలుగుచూసింది.

ప్రస్తుతం చాలా దేశాల్లో లాక్‌డౌన్‌లు ఎత్తేసి ప్రజా రవాణాకు అనుమతులు ఇచ్చాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు సాగించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా సంబంధిత లక్షణాలుంటే వెంటనే టెస్టులు చేయించుకోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తదితర జాగ్రత్తలు ప్రపంచంలో ఏ మూలకెళ్లినా కనబడుతున్నాయి. అయితే కొందరు మాత్రం తమకు ఉన్న కరోనా లక్షణాలను దాచి తప్పించుకోవాలని చూస్తున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా నుంచి లాస్ ఏంజెల్స్‌కు ఓ విమానం బయలు దేరింది. ప్రయాణికులంతా ఎక్కేశారు. దీనిలో ప్రయాణికులకు కరోనా లక్షణాలు చెక్ చేసిన తర్వాతే ప్రయాణికులను విమానంలోకి అనుమతిస్తున్నారు. ఈ సమయంలో తనకు గతంలో కరోనా రాలేదని, అలాగే ఎటువంటి కరోనా లక్షణాలు కూడా లేవని ఓ వ్యక్తి సంతకం చేశాడు. విమానం ప్రయాణం మధ్యలో ఉండగానే ఆ వ్యక్తి కుప్పకూలాడు. ఏం జరిగిందా? అని చూసిన విమాన సిబ్బంది.. సదరు వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గుర్తించారు. పరిస్థితి గమనించిన పైలట్.. వెంటనే విమానం దారి మళ్లించి న్యూఆర్లీన్స్‌కు తీసుకొచ్చాడు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ అతను మరణించాడు.

ఈ విషయం బయట పడటంతో సదరు విమానాన్ని నడిపిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అప్రమత్తం అయింది. వెంటనే సంబంధిత ప్రభుత్వ శాఖకు ఈ సమాచారం అందించింది. ఆ విమానం దారి మారిన సమయంలో కూడా ప్రయాణికులెవరూ విమానం మారలేదని, అందరూ అదే విమానంలో ప్రయాణించారని చెప్పింది. ఈ విషయంలో అధికారులు ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు యునైటెడ్ ప్రకటించింది. మరణించిన ప్రయాణికుడి ద్వారా ఎవరికైనా కరోనా సోకే ప్రమాదం ఉండటంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి, విమాన ప్రయాణికులను ట్రాక్ చేసే పనిలో పడ్డారు.