పాకిస్తాన్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.. నేషనల్ టీ-20 కప్‌లో ఉమర్‌గుల్ బలూచిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.. నిన్న రాత్రి సౌతర్న్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ఉమర్ గుల్ ఈ నిర్ణయాన్ని తెలిపాడు.. ఈ మ్యాచ్‌లో బలూచిస్తాన్ పరాజయం పాలైంది.. అంతే కాకుండా టోర్నీ నుంచి కూడా తప్పుకుంది.. మరోవైపు సౌతర్న్ పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందింది.. ఇది కూడా ఉమర్‌గుల్‌ను బాధించినట్టు ఉంది.. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌లో కొనసాగిన ఉమర్‌గుల్ పాకిస్తాన్‌కు కొన్ని మరపురాని విజయాలను అందించాడు. 20 ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచిన ఆదరించిన ప్రతి ఒక్కరికి ఉమర్‌గుల్ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.. తనకు క్రికెట్ జీవితంలో ఎలా పోరాడాలో చెప్పిందన్నాడు.. దాంతో పాటు విలువలను కూడా నేర్పిందన్నాడు. క్రికెట్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెప్పిన గుల్ కెరీర్ ఎదుగుదలకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్ నుంచి వైదొలగడమన్నది కష్టంగానే ఉన్నా తప్పని పరిస్థితి అని చెప్పాడు..తనకు పేరు ప్రఖ్యాతను తెచ్చిపెట్టిన క్రికెట్‌ను, తన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పాటుపడతానని అన్నాడు .. 2002లో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన ఉమర్‌గుల్ ఆ మరుసటి ఏడాదే సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.. 2004లో భారత్‌తో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్లు తీసుకున్నాడు.. జట్టు విజయంలో ముఖ్య భూమికను పోషించాడు.