చెన్నైలో దారుణం.. ఇద్దరు పోలీసులను ఢీ కొట్టిన బీఎండబ్లూ కారు.. కారణాలు ఇలా ఉన్నాయి..

|

Jan 20, 2021 | 12:50 PM

చెన్నైలో ఇద్దరు పోలీసులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్లూ కారు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

చెన్నైలో దారుణం.. ఇద్దరు పోలీసులను ఢీ కొట్టిన బీఎండబ్లూ కారు.. కారణాలు ఇలా ఉన్నాయి..
Follow us on

చెన్నైలో ఇద్దరు పోలీసులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్లూ కారు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుప్పూర్‌కు చెందిన కార్తిక్‌, రామనాథపురానికి చెందిన రవీంద్రన్‌ సాయుధబలగాల విభాగంలో పోలీసులుగా పనిచేస్తున్నారు. కోయంబేడు బస్‌టెరిమనల్‌లో భద్రతా విధుల్లో ఉన్నారు.

రవీంద్రన్‌ ఆవడిలో, కార్తిక్‌ అన్ననూరులో బస చేశారు. ఈ ఇద్దరు మంగళవారం వేకువజామున ఒకే మోటారు సైకిల్‌పై కోయంబేడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో వెస్ట్‌ మొగపేర్‌ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్రన్‌ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ కార్తిక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.  కాగా కారు నడిపింది విద్యార్థులుగా తేలింది. నొలంబూరుకు చెందిన వరుణ్‌ శేఖర్, కేకే నగర్‌కు చెందిన రోహిత్‌ సూర్య, అంబత్తూరుకు చెందిన అమర్‌నాథ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోహిత్‌ సూర్య బర్త్‌డే వేడుకల్ని కేకేనగర్‌లో జరుపుకున్న ఈ మిత్ర బృందం ఉత్సాహంతో దూకుడుగా వాహనం నడిపి ఇద్దరు పోలీసుల మృతికి కారణమయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

పద్మ అవార్డు వెనక్కి ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ మ్యాస్ట్రో.. అభిమానుల ప్రశ్నలకు సరైన సమాధానం..