కడప జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసాద్ రెడ్డి తన లైసెన్స్డ్ తుపాకీతో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిపై కాల్పలు జరిపాడు. దీంతో ఘటనా స్ధలంలోనే పార్దసారధి రెడ్డి మృతి చెందాడు. అనంతరం ప్రసాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇరువురూ మృతి చెందారు. వ్యక్తిగత గొడవలే ఘటనకు కారణమని స్థానికులు అనుకుంటున్నారు. గత కొంత కాలం ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగదాలు నెలకొన్నాయి. ఇదే అంశంపై చాలా సార్లు గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తి విషయంలో వివాదాలే కాల్పులకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.