పొలంలో 12 అడుగుల భారీ మొసలి..తర్వాత ఏం జరిగిందంటే..

|

Dec 02, 2019 | 2:14 PM

సాధారణంగా మొసలి అనగానే భయమేస్తుంది. దాని రూపాన్ని చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. భయంతో పరుగులు పెడతాం. ఐతే గుజరాత్‌ వడోదరాలోని రావల్‌ వాసులు కూడా తమ పంటపొలాల్లోకొచ్చిన 12 అడుగుల భారీ మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న వైల్డ్‌ లైఫ్‌రెస్క్యూ టీమ్‌..స్థానిక యువకులతో కలిసి ఐదారు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఎలాగోలా ఆ మొసలిని పట్టుకొని వాఘోడియా అటవీ అధికారులకు అప్పగించారు. రావల్‌ పంటపొలాల్లో […]

పొలంలో 12 అడుగుల భారీ మొసలి..తర్వాత ఏం జరిగిందంటే..
Follow us on

సాధారణంగా మొసలి అనగానే భయమేస్తుంది. దాని రూపాన్ని చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. భయంతో పరుగులు పెడతాం. ఐతే గుజరాత్‌ వడోదరాలోని రావల్‌ వాసులు కూడా తమ పంటపొలాల్లోకొచ్చిన 12 అడుగుల భారీ మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న వైల్డ్‌ లైఫ్‌రెస్క్యూ టీమ్‌..స్థానిక యువకులతో కలిసి ఐదారు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఎలాగోలా ఆ మొసలిని పట్టుకొని వాఘోడియా అటవీ అధికారులకు అప్పగించారు.

రావల్‌ పంటపొలాల్లో భారీ మొసలి ఉన్నట్లు స్థానిక నర్మదా కాలువ ఇంజనీర్ల నుంచి తమకు కాల్‌ వచ్చిందని..అక్కడికి వెళ్లి ఆ మొసలిని పట్టుకోవడానికి ఐదారు గంటలపాటు శ్రమించాల్సివచ్చిందన్నారు హేమంత్‌ వాధ్వానా అనే వైల్డ్‌లైఫ్‌ యాక్టివిస్ట్‌.  దగ్గరలోని అజ్వా అనే రిజర్వాయర్‌ నుంచి కాలువల ద్వారా పొలంలోకి ప్రవేశించి ఉండొచ్చని తెలిపారు. ఇక ఆ క్రొకొడైల్‌ను మొసళ్లకు నివాసంగా ఉన్న సమీపంలోని సరస్సులో వదిలిపెట్టినట్టినట్లు తెలిపారు అటవీ అధికారులు. గతేడాది కాలంలో ఇదే ప్రాంతంలో ఇది మూడవ ఘటన అని వెల్లడించారు