ఉనికి కోసమే కాంగ్రెస్ నేతల నీటి డ్రామాలు : మంత్రి జగదీష్ రెడ్డి

పదవుల కోసం ప్రాజెక్టులను అడ్డుకున్నోళ్లు జలదీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు రాజకీయాల కోసమే కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్న మంత్రి జగదీష్ రెడ్డి.

ఉనికి కోసమే కాంగ్రెస్ నేతల నీటి డ్రామాలు : మంత్రి జగదీష్ రెడ్డి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 11:32 AM

పదవుల కోసం ప్రాజెక్టులను అడ్డుకున్నోళ్లు జలదీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు రాజకీయాల కోసమే కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు. ఆంధ్ర నేతల మంత్రివర్గంలో మంత్రులుగా ఉండి ఏనాడు పోతిరెడ్డి పాడుతో పాటు ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. సీమాంధ్రకు పోయిన తెలంగాణ నీళ్లకు హారతులు పట్టిన నేతలే ఈ రోజు పోతిరెడ్డిపాడు గురించి నీతులు చెబుతున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి ద్రోహానికి పాల్పడింది కాంగ్రెస్ నేతలన్న మంత్రి.. వారి నిర్వాకంతో ఏ ఒక్క ప్రాజెక్టు గానీ, రిజర్వాయర్ గానీ నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. కనీసం తెలంగాణను ఒక ప్రాంతంగానైనా గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి మిగులు జలాలను వాడుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన మంత్రి.. ఏపీ ఫ్రభత్వం ఇచ్చిన జీవోపై కృష్ణా బోర్డులో ఫిర్యాదు చేశామన్నారు. కృష్ణా నదిపై చేపట్టే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. మరోవైపు జీవో 203పై కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వం తమ అభిప్రాయం స్పష్టం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. 2013-14లో ఎంత పంట పండింది ఇప్పడు ఎంత దిగుబడి వచ్చిందో లెక్కలు చూడాలన్నారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కోయిల్ సాగర్ ,నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టులకు నీళ్లు రప్పించగలిగామని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో