ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ముఖ్యమైన ఇంటర్ సెక్షన్స్ వద్ద 10 బేసిక్ ట్రామా సెంటర్లను ‘వరల్డ్ ట్రామా డే’ సందర్భంగా శనివారం పురపాలిక, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ 32 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని.. 24/7 మెడికల్ ఎమర్జెన్సీ సౌకర్యంతో ఇవి అందుబాటులో ఉంటాయని అన్నారు. (Trauma care centres)
అంతేకాకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ప్రమాదపరిస్థితి పరిశీలించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ వైద్యుల సూచనల ప్రకారం ఈ ట్రామా సెంటర్లలో వైద్య సేవలను అందిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రామా సెంటర్లతో పాటు 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే మరిన్ని అధునాతన అంబులెన్స్ సర్వీసులను అందించేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
On “World Trauma Day” today, will be dedicating 10 Trauma care centres at important intersections with 10 advance life support Ambulances on #ORR (each covering ~32 kms stretch 24/7) enabling immediate relief in road accidents on ORR@HMDA_Gov @arvindkumar_ias pic.twitter.com/rL2Szn1hbu
— KTR (@KTRTRS) October 17, 2020